Friday, 30 March 2018

About Nabeel Qureshi

P

opular evangelist Nabeel Qureshi, who once sought Allah, has now found Jesus face to face. He died Saturday of stomach cancer.


The 34-year-old convert from Islam was an itinerant speaker with Ravi Zacharias International Ministries (RZIM) until his diagnosis last summer. He spent months in aggressive treatment, including the removal of his stomach, all the while praying for a miracle to heal him.
In a September 8 video, the last one posted before his death, Qureshi announced that doctors had “given up” on treating him and put him on palliative care.
“If there’s something I’m wrestling with through all this, it’s ‘Where does my faith need to be?’ vs. ‘I, as a believer, am a real person. Where can I actually find my faith?’” he said.
“In other words, do I need to perform? Do I need to say, ‘I’m going to have this level of faith right now.’ Honestly, I don’t think so. I think God understands where I am right now and he comes alongside us in that and he loves us and gives us the strength.”
Qureshi had been receiving treatment at M. D. Anderson Cancer Center in Houston, where his home faced floods during Hurricane Harvey weeks before.
He was raised in a Pakistani-American Ahmadi Muslim family and came to faith reading the Bible to debate a medical school friend. He shared his testimony in his book, Seeking Allah, Finding Jesus, and in a 2014 issue of Christianity Today.
The God of the Bible “reached me through investigations, dreams, and visions, and called me to prayer in my suffering,” he said. “It was there that I found Jesus. To follow him is worth giving up everything.”
Ravi Zacharias and his team met with their ailing colleague for a preliminary goodbye in May. At the time, Zacharias wrote, “He is torn between what seems imminent and what is always possible with God.”
He described Qureshi as “one of the finest preachers I have ever heard.” [Editor’s note: Zacharias later shared a personal tribute to his protégé, as well as gave the eulogy at his memorial service.]
Qureshi got his M.D. from Eastern Virginia Medical School and held masters degrees in Christian apologetics from Biola University and in religion from Duke University.
He is also the author of No God but One: Allah or Jesus? and Answering Jihad: A Better Way Forward and had been working on another book, 20 Questions Muslims Ask and the Answers that Convert Them. The cross-cultural apologist was listed among CT’s 33 Christians under 33.
He leaves behind his wife, Michelle, and daughter, Ayah.

Thursday, 29 March 2018

దేవుడు వాస్తవమైనవాడా? దేవుడు వాస్తవమైనవాడని నేను ఎలా తెలుసుకోగలను

దేవుడు వాస్తవమైనవాడా? దేవుడు వాస్తవమైనవాడని నేను ఎలా తెలుసుకోగలను?



ప్రశ్న: దేవుడు వాస్తవమైనవాడా? దేవుడు వాస్తవమైనవాడని నేను ఎలా తెలుసుకోగలను?

జవాబు: 
దేవుడు వాస్తవమైన వాడని మనకు తెలుసు ఎందుకంటే ఆయన మూడు విధాలుగా మనకు బయలుపరచుకున్నాడు: సృష్టి ద్వారా, తన వాక్యము ద్వారా, మరియు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా.

దేవుని ఉనికికి గల మామూలు ఆధారము ఆయన చేసినదే అయి ఉంది. “ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు” (రోమా. 1:20). “ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది” (కీర్తన. 19:1).

ఒకవేళ ఏదైనా ఒక పొలము మధ్యలో ఒక చేతి గడియారాన్ని మీరు కనుగొంటే, అది శూన్యం నుండి అలా “ప్రత్యక్షమైంది” అనో లేదా అది అక్కడే ఎప్పుడు నుండో ఉన్నదనో మీరు అనుకోరు. ఆ గడియారం యొక్క రూపాన్ని బట్టి దానికి ఒక రూపకర్త ఉన్నాడని మీరు అనుకుంటారు. కాని మన చుట్టూ కూడా మిక్కిలి గొప్పదైన రూపము మరియు ఖచ్చితత్వము ఉన్నాయి. మనము సమయమును కొలిచేది మన చేతిగడియారముల మీద ఆధారపడి కాదు, కాని దేవుని చేతి పనియైన భూమి యొక్క నిత్యకృత్యమైన భ్రమణమును (మరియు సీసియం 133 అనే అణువు యొక్క రేడియోధార్మిక లక్షణములను) ఆధారము చేసికొని. ఈ విశ్వము గొప్ప రూపాన్ని చూపుతుంది, మరియు ఇది ఒక గొప్ప రూపకర్త ఉన్నాడని వాదిస్తుంది.

ఒకవేళ మీరు ఏదైనా సంకేత భాషలో ఉన్న సందేశాన్ని కనుగొంటే, ఆ సంకేతాలను విప్పుటకు ప్రయత్నిస్తారు. ఈ సందేశమును పంపిన తెలివైన పంపకుడు ఒకడు ఉన్నాడని, ఆ సంకేతాలను సృష్టించినవాడు ఉన్నాడని మీరు అనుకుంటారు. మన శరీరములలోని ప్రతి కణములో మనము మోసే DNA “సంకేతము” ఎంతటి సంక్లిష్టమైనది? ఈ DNA యొక్క సంక్లిష్టత మరియు ఉద్దేశ్యము ఆ సంకేతమును వ్రాసిన ఒక తెలివైన రచయితను సూచించుట లేదా?

దేవుడు జటిలమైన మరియు బాగుగా శృతి చేయబడిన భౌతిక ప్రపంచమును సృష్టించడమే కాదు; ప్రతి ఒక్కరి హృదయములో నిత్యత్వమును గూర్చిన ఒక ఆలోచనను కూడా నేర్పాడు (ప్రసంగి 3:11). మన కంటికి కనబడే దాని కంటే జీవితమునకు ఎక్కువైనది ఎదో ఉందని, ఈ భూమిపై జరిగే దినచర్య కంటే ఉన్నతమైన మనుగడ ఎదో ఉందని మానవాళికి ఒక అంతర్గత ఆలోచన ఉంది. నిత్యత్వమును గూర్చిన మన భావన రెండు విధాలుగా తేటపడుతుంది: చట్టముల నిర్మాణం మరియు ఆరాధన.

చరిత్ర అంతటిలో గల అనేక నాగరికతలు కొన్ని నైతిక చట్టములను గణ్యము చేశారు, ఇవి ఆశ్చర్యకరంగా ఒక సంస్కృతి నుండి ఇంకొక సంస్కృతితో పోలిస్తే ఒకే విధంగా ఉన్నటువంటివి. ఉదాహరణకు, ప్రేమ అనే ఆదర్శము విశ్వవ్యాప్తంగా గణ్యము చేయబడినది, కాని అబద్ధం అనే కార్యం విశ్వవ్యాప్తంగా ఖండించబడినది. ఈ సామాన్యమైన నైతికత –తప్పు ఒప్పులు గూర్చిన ఈ విశ్వ జ్ఞానం – మనకు ఇట్టి ఆలోచనలను ఇచ్చిన ఒక ఉన్నతమైన నైతిక వ్యక్తిని సూచిస్తుంది.

అదే విధంగా, సంస్కృతులకు అతీతంగా ప్రపంచవ్యాప్త ప్రజలు ఒక విధమైన ఆరాధన విధానాన్ని అలవర్చుకున్నారు. ఆ ఆరాధన యొక్క వస్తువు మారవచ్చు, కాని మానవునిగా ఉండుటకు “ఉన్నత శక్తి” ఒకటి ఉంది అనే ఆలోచన తిరస్కరించలేని భాగము. ఆరాధించుటకు గల మన వాంఛ దేవుడు మనలను “తన పోలికలో” చేశాడు అనుదానితో అనునయిస్తుంది (ఆది. 1:27).

దేవుడు తన వాక్యమైన పరిశుద్ధ గ్రంధము ద్వారా కూడా తనను మనకు ప్రత్యక్షపరచుకున్నాడు. లేఖనముల అంతటిలో దేవుని యొక్క ఉనికి అనునది స్వయం-ఆధారిత వాస్తవముగా ఉంది (ఆది. 1:1; నిర్గమ. 3:14). మనిషి స్వీయచరిత్రను వ్రాసేటప్పుడు, తన సొంత ఉనికిని నిరూపించుకొనుటలో సమయాన్ని వృద్ధా చేయడు. అలాగే, దేవుడు తన పుస్తకములో ఆయన ఉనికిని నిరూపించుకుంటూ కాలయాపన చేయడు. పరిశుద్ధ గ్రంధము యొక్క జీవితములను మార్చే గుణం, దాని యదార్ధత, మరియు దాని వ్రాయుటలో కలిసి వచ్చిన అనేకమైన సూచక క్రియలు ఒక లోతైన దృష్టికిఉత్తరువుగా ఉన్నాయి.

దేవుడు తనను మనకు ప్రత్యక్షపరచుకున్న మూడవ విధానం యేసుక్రీస్తు అనే తన కుమారుని ద్వారా (యోహాను 14:6-11). “ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి” (యోహాను 1:1, 14; కొలస్సీ. 2:9 కూడా చూడండి).

ఆశ్చర్యకరమైన యేసు జీవితంలో ఆయన పాత నిబంధన ధర్మశాస్త్రమును పరిపూర్ణంగా అనుసరించాడు మరియు మెస్సియను గూర్చిన ప్రవచనములను కూడా నెరవేర్చాడు (మత్తయి 5:17). తన సందేశమును అధీకృతం చేసి తన దైవత్వమునకు సాక్ష్యముగా దయగల అనేక కార్యములను మరియు బహిరంగ సూచనలను జరిగించాడు (యోహాను 21:24-25). అప్పుడు, తన శిలువ మరణమునకు మూడు దినములు తరువాత, మృతులలో నుండి ఆయన లేచాడు, ఈ వాస్తవం అనేకమంది ప్రత్యక్షసాక్షుల ద్వారా నిరూపించబడింది (1 కొరింథీ. 15:6). యేసు ఎవరు అనే విషయంపై చారిత్రక కథనాలు చాలా “ఋజువులతో” నిండి ఉన్నాయి. అపొస్తలుడైన పౌలు చెప్పినట్లుగా, “ఇది యొక మూలను జరిగిన కార్యము కాదు” (అపొ.కా. 26:26).

దేవుని గురించి సొంత ఆలోచనలు కలిగియుండి ఆధారములను వారికి అనుగుణ్యంగా చదివే సంశయవాదులు ఎప్పుడు ఉంటారని మనం గ్రహించాము. మరియు కొంత మంది ఉంటారు వారిని ఎట్టి ఋజువులు కూడా ఒప్పుకొనేటట్లు చేయలేవు (కీర్తన. 14:1). ఇది అంతయు విశ్వాసము ద్వారానే జరుగుతుంది (హెబ్రీ. 11:6).

Tuesday, 27 March 2018

. యేసు దేవుడేనా? యేసు తాను దేవుడనని ఎప్పుడైనా అన్నాడా??


ప్రశ్న: యేసు దేవుడేనా? యేసు తాను దేవుడనని ఎప్పుడైనా అన్నాడా?ప్రశ్న: యేసు దేవుడేనా? యేసు తాను దేవుడనని ఎప్పుడైనా అన్నాడా?

జవాబు: 


జవాబు: 
“నేను దేవుడను” అను ఖచ్చితమైన మాటలను యేసు చెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంధంలో ఎక్కడా నమోదు చేయబడలేదు. అలాగంటే, ఆయన దేవుడను కానని చెప్పినట్లుగా కాదు. ఉదాహరణకు యోహాను 10:30లో యేసు పలికిన మాటలను తీసుకోండి, “నేనును తండ్రియును ఏకమైయున్నాము.” ఆయన చెప్పిన ఈ మాటకు ఆయన స్పందనను తీసుకుంటే ఆయన దేవుడనని చెప్తున్నట్లుగా ఉంది. ఈ కారణము చేతనే అక్కడివారు ఆయనను రాళ్ళతో కొట్టుటకు సిద్ధమయ్యారు “...నీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు” అన్నారు (యోహాను 10:33). యేసు ఏమి చేపున్నాడో యూదులు ఖచ్చితంగా అర్ధం చేసుకున్నారు – తను దేవుడనని. దేవునిగా ఆయన చెప్పుకొనుటను ఆయన విస్మరించలేదు. “నేనును తండ్రియును ఏకమైయున్నాము” అని ఆయన చెప్పినప్పుడు ఆయన మరియు తండ్రి ఇద్దరు ఒకే స్వభావము మరియు మూలమును కలిగియున్నారని ఆయన అర్ధము. యోహాను 8:58లో ఇంకొక ఉదాహరణ ఉంది. యేసు చెప్పాడు “అబ్రాహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను!” ఈ వాక్యమును విన్న యూదుల యొక్క స్పందన ఏమంటే దేవదూషణ చేయుచున్నాడని, మోషే ధర్మశాస్త్రము వారిని నిర్దేశించినట్లుగా ఆయనను చంపుటకు (లేవీయ. 24:15) రాళ్ళు తీసుకొనబోయారు.

యేసు యొక్క దైవత్వమును యోహాను పునరుద్ఘాటిస్తున్నాడు: “వాక్యమే దేవుడైయుండెను” మరియు “వాక్యము శరీరధారి యాయెను” (యోహాను 1:1, 14). యేసు శరీరములో ఉన్న దేవుడని ఈ వచనములు స్పష్టంగా సూచిస్తున్నాయి. అపొస్తలుల కార్యములు 20:28లో “దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు ... జాగ్రత్తగా ఉండుడి” అని చదువుతాం. సంఘమును – దేవుని సంఘమును – తన స్వరక్తమిచ్చి కొన్నది ఎవరు? యేసు క్రీస్తు. అపొస్తలుల కార్యములు 20:28 దేవుడు సంఘమును తాన సొంత రక్తము ఇచ్చి కొన్నాడని చెప్తుంది. కాబట్టి యేసు దేవుడే!

శిష్యుడైన తోమా యేసును గూర్చి చెప్పాడు, “నా ప్రభువా మరియు నా దేవా” అని (యోహాను 20:28). యేసు ఆయనను సరిచేయలేదు. తీతుకు 2:13 మన దేవుడును రక్షకుడైన యేసుక్రీస్తు రాకడ కొరకు కనిపెట్టమని ప్రోత్సహిస్తుంది (2 పేతురు 1:1 కూడా చూడండి). హెబ్రీ పత్రిక 1:8లో యేసును గూర్చి తండ్రి మాట్లాడుతూ, “తన కుమారుని గూర్చియైతే దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది;నీ రాజదండము న్యాయార్థమయినది” అని అన్నాడు. తండ్రి యేసును “దేవా” అని సంబోధించడం యేసు నిజముగా దేవుడేనని సూచిస్తుంది.

ప్రకటన గ్రంధంలో దూత అపొస్తలుడైన యోహానును దేవుని మాత్రమే ఆరాధించమని ఉపదేశించింది (ప్రకటన 19:10). లేఖనములలో పలుమార్లు యేసు ఆరాధనను అందుకున్నాడు (మత్తయి 2:11, 14:33, 28:9, లూకా 24:52; యోహాను 9:38). ఆయనను ఆరాధించినందుకు ఎప్పుడు ప్రజలను ఆయన గద్దించలేదు. యేసు ఒకవేళ దేవుడు కాకపోతే, ఆయనను ఆరాధించవద్దని ప్రజలకు, అంటే ప్రకటన గ్రంధంలో ఆ దూత చెప్పినట్లుగానే, చెప్పేవాడు. యేసు దైవత్వమును గూర్చి వాదించి మాట్లాడే అనేక ఇతర వచనములు వాక్యభాగములు లేఖనాల్లో ఉన్నాయి.

యేసు తప్పకుండా దేవుడే అయి ఉండవలసిన ప్రాముఖ్యమైన కారణం ఏమంటే ఒకవేళ ఆయన దేవుడు కాకపొతే, ఈ లోకపు పాపములను పరిహరించుటకు ఆయన చెల్లించిన క్రయధనము సరిపోయేది కాదు (1 యోహాను 2:2). సృష్టించబడిన వ్యక్తి, అంటే యేసు ఒకవేళ దేవుడు కాకుంటే ఇదే అయి ఉంటాడు, అనంతమైన దేవునికి పాపమును బట్టి చెల్లించవలసిన అనంతమైన క్రయధనమును చెల్లించలేడు. దేవుడు మాత్రమే లోకపు పాపములను మోసికొనగలడు (2 కొరింథీ. 5:21), మరణించి, పునరుత్ధానుడై లేచి, పాపము మరియు మరణముపై తన విజయాన్ని నిరూపించాడు.

జవాబు: 
“నేను దేవుడను” అను ఖచ్చితమైన మాటలను యేసు చెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంధంలో ఎక్కడా నమోదు చేయబడలేదు. అలాగంటే, ఆయన దేవుడను కానని చెప్పినట్లుగా కాదు. ఉదాహరణకు యోహాను 10:30లో యేసు పలికిన మాటలను తీసుకోండి, “నేనును తండ్రియును ఏకమైయున్నాము.” ఆయన చెప్పిన ఈ మాటకు ఆయన స్పందనను తీసుకుంటే ఆయన దేవుడనని చెప్తున్నట్లుగా ఉంది. ఈ కారణము చేతనే అక్కడివారు ఆయనను రాళ్ళతో కొట్టుటకు సిద్ధమయ్యారు “...నీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు” అన్నారు (యోహాను 10:33). యేసు ఏమి చేపున్నాడో యూదులు ఖచ్చితంగా అర్ధం చేసుకున్నారు – తను దేవుడనని. దేవునిగా ఆయన చెప్పుకొనుటను ఆయన విస్మరించలేదు. “నేనును తండ్రియును ఏకమైయున్నాము” అని ఆయన చెప్పినప్పుడు ఆయన మరియు తండ్రి ఇద్దరు ఒకే స్వభావము మరియు మూలమును కలిగియున్నారని ఆయన అర్ధము. యోహాను 8:58లో ఇంకొక ఉదాహరణ ఉంది. యేసు చెప్పాడు “అబ్రాహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను!” ఈ వాక్యమును విన్న యూదుల యొక్క స్పందన ఏమంటే దేవదూషణ చేయుచున్నాడని, మోషే ధర్మశాస్త్రము వారిని నిర్దేశించినట్లుగా ఆయనను చంపుటకు (లేవీయ. 24:15) రాళ్ళు తీసుకొనబోయారు.

యేసు యొక్క దైవత్వమును యోహాను పునరుద్ఘాటిస్తున్నాడు: “వాక్యమే దేవుడైయుండెను” మరియు “వాక్యము శరీరధారి యాయెను” (యోహాను 1:1, 14). యేసు శరీరములో ఉన్న దేవుడని ఈ వచనములు స్పష్టంగా సూచిస్తున్నాయి. అపొస్తలుల కార్యములు 20:28లో “దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు ... జాగ్రత్తగా ఉండుడి” అని చదువుతాం. సంఘమును – దేవుని సంఘమును – తన స్వరక్తమిచ్చి కొన్నది ఎవరు? యేసు క్రీస్తు. అపొస్తలుల కార్యములు 20:28 దేవుడు సంఘమును తాన సొంత రక్తము ఇచ్చి కొన్నాడని చెప్తుంది. కాబట్టి యేసు దేవుడే!

శిష్యుడైన తోమా యేసును గూర్చి చెప్పాడు, “నా ప్రభువా మరియు నా దేవా” అని (యోహాను 20:28). యేసు ఆయనను సరిచేయలేదు. తీతుకు 2:13 మన దేవుడును రక్షకుడైన యేసుక్రీస్తు రాకడ కొరకు కనిపెట్టమని ప్రోత్సహిస్తుంది (2 పేతురు 1:1 కూడా చూడండి). హెబ్రీ పత్రిక 1:8లో యేసును గూర్చి తండ్రి మాట్లాడుతూ, “తన కుమారుని గూర్చియైతే దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది;నీ రాజదండము న్యాయార్థమయినది” అని అన్నాడు. తండ్రి యేసును “దేవా” అని సంబోధించడం యేసు నిజముగా దేవుడేనని సూచిస్తుంది.

ప్రకటన గ్రంధంలో దూత అపొస్తలుడైన యోహానును దేవుని మాత్రమే ఆరాధించమని ఉపదేశించింది (ప్రకటన 19:10). లేఖనములలో పలుమార్లు యేసు ఆరాధనను అందుకున్నాడు (మత్తయి 2:11, 14:33, 28:9, లూకా 24:52; యోహాను 9:38). ఆయనను ఆరాధించినందుకు ఎప్పుడు ప్రజలను ఆయన గద్దించలేదు. యేసు ఒకవేళ దేవుడు కాకపోతే, ఆయనను ఆరాధించవద్దని ప్రజలకు, అంటే ప్రకటన గ్రంధంలో ఆ దూత చెప్పినట్లుగానే, చెప్పేవాడు. యేసు దైవత్వమును గూర్చి వాదించి మాట్లాడే అనేక ఇతర వచనములు వాక్యభాగములు లేఖనాల్లో ఉన్నాయి.

యేసు తప్పకుండా దేవుడే అయి ఉండవలసిన ప్రాముఖ్యమైన కారణం ఏమంటే ఒకవేళ ఆయన దేవుడు కాకపొతే, ఈ లోకపు పాపములను పరిహరించుటకు ఆయన చెల్లించిన క్రయధనము సరిపోయేది కాదు (1 యోహాను 2:2). సృష్టించబడిన వ్యక్తి, అంటే యేసు ఒకవేళ దేవుడు కాకుంటే ఇదే అయి ఉంటాడు, అనంతమైన దేవునికి పాపమును బట్టి చెల్లించవలసిన అనంతమైన క్రయధనమును చెల్లించలేడు. దేవుడు మాత్రమే లోకపు పాపములను మోసికొనగలడు (2 కొరింథీ. 5:21), మరణించి, పునరుత్ధానుడై లేచి, పాపము మరియు మరణముపై తన విజయాన్ని నిరూపించాడు.

Saturday, 24 March 2018

ఆత్మహత్య.....గురించి బైబిల్ ఏం చెబుతోంది....?A Suicide

ఆత్మహత్యను గూర్చి క్రైస్తవ దృష్టికోణం ఏమిటి? ఆత్మహత్యను గూర్చి బైబిల్ ఏమి చెబుతుంది?



ప్రశ్న: ఆత్మహత్యను గూర్చి క్రైస్తవ దృష్టికోణం ఏమిటి? ఆత్మహత్యను గూర్చి బైబిల్ ఏమి చెబుతుంది?

జవాబు: 
బైబిల్ ఆత్మహత్య చేసుకున్న ఆరుగురు వ్యక్తులను గూర్చి చెబుతుంది: అబీమెలెకు (న్యాయాధి. 9:54), సౌలు (1 సమూ. 31:4), సౌలు ఆయుధములు మోయువాడు (1 సమూ. 31:4-6), ఆహీతోపెలు (2 సమూ. 17:23), జిమీ (1 రాజులు 16:18), మరియు యూదా (మత్తయి 27:5). వారిలో ఐదుగురు దుష్ట, పాపపు పురుషులు (ఆయన స్వభావమును గూర్చి తెలుసుకొనుటకు సౌలు యొక్క ఆయుధములు మోయువాని గురించి ఎక్కువగా చెప్పబడలేదు). కొందరు సంసోనుది కూడా ఆత్మహత్య అని చెబుతారు (న్యాయాధి. 16:26-31), కాని సంసోను యొక్క గురి తనను తాను చంపుకొనుట కాదుగాని, ఫిలిష్తీయులను చంపుట. బైబిల్ ఆత్మహత్యను కూడా హత్యగా పరిగణిస్తుంది, అది – స్వయం హత్య. ఒక వ్యక్తి ఎప్పుడు ఎలా మరణించాలని నిర్ణయించేది దేవుడు మాత్రమే.

బైబిల్ ప్రకారం, ఒక వ్యక్తి పరలోకానికి చేరతాడా లేదా అని నిర్థారించేది ఆత్మహత్య కాదు. ఒక రక్షణపొందని వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే, అతడు చేసింది కేవలం నరకానికి తన యాత్రను “వేగిరపరచుకొనుట.” అయితే, ఆత్మహత్య చేసుకున్న ఆ వ్యక్తి క్రీస్తులో రక్షణను నిరాకరించినందుకు నరకానికి వెళ్తాడుగాని, ఆత్మహత్య చేసుకున్నందుకు కాదు. ఆత్మహత్య చేసుకొనే క్రైస్తవుని గూర్చి బైబిల్ ఏమి చెబుతుంది? మనం క్రీస్తు నందు విశ్వాసముంచిన మరుక్షణం నుండి మనకు నిత్య జీవము నిర్థారించబడినది అని బైబిల్ చెబుతుంది (యోహాను 3:16). బైబిల్ ప్రకారం, వారి యొద్ద నిత్య జీవము ఉన్నదని క్రైస్తవులు ఎలాంటి సందేహం లేకుండా తెలుసుకోగలరు (1 యోహాను 5:13). ఒక క్రైస్తవుని దేవుని ప్రేమ నుండి ఏది వేరు చేయలేదు (రోమా. 8:38-39). “సృష్టించబడినది” ఏది ఒక క్రైస్తవుని దేవుని ప్రేమ నుండి వేరుచేయలేకపోతే, ఆత్మహత్య చేసుకున్న క్రైస్తవుడు కూడా “సృష్టించబడినవాడే,” కాబట్టి ఆత్మహత్య కూడా వారిని దేవుని ప్రేమ నుండి వేరుచేయలేదు. యేసు మనందరి పాపముల కొరకు మరణించాడు, మరియు ఒక నిజమైన విశ్వాసి, ఆత్మీయ దాడి లేక బలహీనత సమయంలో ఆత్మహత్య చేసుకున్నయెడల, ఆ పాపము కూడా క్రీస్తు రక్తము ద్వారా కప్పబడుతుంది.

అయినను ఆత్మహత్య దేవునికి విరోధంగా ఒక గంభీరమైన పాపం. బైబిల్ ప్రకారం, ఆత్మహత్య హత్యతో సమానం; అది ఎల్లప్పుడూ తప్పే. ఒక క్రైస్తవుడని చెబుతూ ఆత్మహత్య చేసుకొనే వాని యొక్క విశ్వాసంపై అనేక సందేహాలు తలెత్తుతాయి. ఏ పరిస్థితి కూడా ఒకరిని సమర్థించలేదు, ముఖ్యంగా ఒక క్రైస్తవుడు అతని/ఆమె ప్రాణమును తీసుకొనుట. వారి జీవితలను దేవుని కొరకు బ్రతుకుటకు క్రైస్తవులు పిలువబడిరి, మరియు ఎప్పుడు మరణించాలనేది కేవలం దేవుని నిర్ణయం మాత్రమే. ఇది ఆత్మహత్యను వివరించకపోయినప్పటికీ, 1 కొరింథీ. 3:15 ఆత్మహత్య చేసుకున్న క్రైస్తవునికి ఏమి జరగవచ్చునో వివరిస్తుంది: “అతడు తనమట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకొన్నట్టు రక్షింపబడు

Friday, 23 March 2018

A LEAVE US FREE: మారిపోయిన జీవితానికి ఆధారం

A LEAVE US FREE: మారిపోయిన జీవితానికి ఆధారం: మారిపోయిన జీవితానికి ఆధారం నా జీవితాన్ని నేను ద్వేషిస్తున్నాను అని ఎప్పుడైన అనుకున్నా నా? శాశ్వతంగా నీ జీవితాన్ని మార్చివేసే విధానం. ...

మారిపోయిన జీవితానికి ఆధారం

మారిపోయిన జీవితానికి ఆధారం

నా జీవితాన్ని నేను ద్వేషిస్తున్నాను అని ఎప్పుడైన అనుకున్నా నా? శాశ్వతంగా నీ జీవితాన్ని మార్చివేసే విధానం.

జోష్ మెక్ డొవెల్
నేను సంతోషముగా ఉండాలనుకుంటునాను. ప్రపంచం మొత్తంలో సంతోషముగా ఉండేవారిలో నేను ఒకడిగా ఉండాలనుకుంటున్నాను. నా జీవితము యొక్క అర్ధాన్ని తెలుసుకోవాలనుకుంటునాను. నేను చాలా ప్రశ్నలకు జవాబు వెతుకుతునాను.
  • నేను ఎవరు?
  • నేను ఈ లోకంలో ఇక్కడే ఎందుకు వున్నాను?
  • నా జీవితం ఎటు వెళ్ళుతుంది?
నేను స్వేచ్చగా ఉండాలనుకుంటున్నాను. ప్రపంచంలో ఉన్నవారందరిలో నేను పూర్తి స్వేచ్చ కలిగిన వ్యక్తిగా ఉండాలని ఉంది. నా విషయంలో స్వేచ్చ అంటే నాకు నచ్చినది మాత్రమే చేయటం కాదు. అలా అయితే ఎవరన్న చేయగలరు. కాని, నాకు స్వేచ్చ అంటే నీవు ఏదైతే చెయ్యాలో అది చేసేటువంటి అధికారం కలిగి ఉండటం. చాలా మందికి వారు ఏమి చేయ్యాలో తెలుసుకాని ఆపని చేసే అధికారం ఉండదు. కాబట్టి నేను సమాధానాలను వెదకడం మొదలుపెట్టాను.

మంచి మార్పుని ఎక్కడ పొందగలం?

ఈ లోకంలో ప్రతిఒకరు ఏదో ఒక మతాన్ని వెంబడిస్తూనే ఉంటారు, నేను కూడా అదే చేసాను, చర్చికి వెళ్ళేవాడిని. నేను మంచి చర్చ్ కు వెళ్ళలేదేమో అనిపించేది ఎందుకంటే నేను ఏమి మారలేదు. నేను చర్చికి ఉదయం వెళ్ళేవాడిని, మధ్యానం, సాయంత్రం కూడ వెళ్ళేవాడిని. కాని నాకు ఏమి ఉపయోగంలేదు. నేను ఏదైన పాటించె వ్యక్తిని, ఏదైనా మార్పు తీసుకురాకపొతే నేను అసల పాటించను, వదిలేస్తాను కాబట్టి మతాన్ని వదిలేశాను.
జీవితం మారాలంటే పరువు సంపాదిస్తే సరిపోతుందనిపించింది. ఒక్క నాయకుడిగా ఉండి ఒక లక్ష్యం కలిగి జీవిస్తూ ఆ లక్ష్యం కోసమే పని చేస్తూ ఉంటే సరిపోతుందని అనుకుందాం. నేను చదివే విశ్వవిద్యాలయంలో స్టూడెంట్ లీడర్స్ మంచి అధికారం, పలుకుబడి కలిగి ఉండేవాళ్ళు. కాబట్టి, పరిగెత్తుకుంటూ వెళ్ళి క్లాస్ లకు అధికారిగా పోటిచేసి ఎన్నుకోబడ్డాను. నాకు చాలా పరువు వచ్చినట్టుగా భావించాను, నేను అందరికీ తెలిసిపోయాను, పెద్ద నిర్ణయాలు తీసుకునేవాడిని, విశ్వవిద్యాలయం డబ్బు కర్చుపెట్టి నాకు నచ్చిన వారిని తీసుకువచ్చి మాట్లాడించేవాడిని. బాగానే ఉంది, కాని నేను ప్రయత్నించినవని ఎలాగైతే మార్చలేదో ఇది కూడా నన్ను మార్చలేదు. సోమవారం ఉదయం లేచి తలనొప్పితో పడుకునేవాడిన్ని. సోమవారం నుండి శుక్రవారం వరకూ భరించేవాడిని. వారంలో మూడు రాత్రులు మాత్రమే సంతోషముగా ఉండేవాడిని, శుక్రవారం రాత్రి, శనివారం, ఆదివారం మళ్ళీ భయంకరమైన జీవితం ప్రారంభమయ్యేది.

జీవితం మార్పుకోసం వెదకటం, మంచి మార్పు.

కాలేజీలలోను, విస్వవిద్యాలయాలలోనూ ఉన్న వారిలో, కొంతమంది, యదార్ధంగా, జీవితము యొక్క అర్ధాన్ని, సత్యాన్ని, జీవితపు ఉద్దేశాన్ని నాకంటే ఆశక్తిగా వెతుకుతున్నారు.
నా జీవితపు ప్రయాణములో నేను ఒక చిన్నగ్రూప్ ని కలుసుకున్నాను. అందులో ఎనిమిది మంది విద్యార్ధులు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళ జీవితాలు చాలా ప్రత్యేకంగా ఉండటం గమనించాను. వాళ్ళు దేనిన్నైతే నమ్మాలో చాలా గట్టి విశ్వాసంతో నమ్మి ఉన్నారని గ్రహించాను. వాళ్ళు వెంబడిస్తున్న మార్గంలో ఎక్కడకి వెళ్ళుతున్నారో బాగా తెలిసినవారుగా కనబడ్డారు.
నేను గమనించిన విద్యార్ధులు కేవలం ప్రేమ గురించి మాట్లాడటమే కాదు - వారు అందులో పాలుపొందుతున్నారు. విశ్వవిద్యాలయపు జీవిత పరిస్థితులను చాలా సులభంగా అధికమిస్తున్నారు, మిగతా విద్యార్ధులంతా ఒత్తిడికి లోనై ఇబ్బంది పడుతుంటే మీరేమో చాలా ప్రశాంతంగా వాళ్ళ పరిస్తితులను గెలుస్తునారు. వాళ్ళ హృదయంలో లోతైన ఆనందాని కలిగి వున్న వారలాగా కనబడ్డారు. వాళ్ళు చాలా ప్రత్యేకమైన రీతిగా సంతోషముగా ఉన్నారు. నాకనిపించినది ఏమిటంటే వీరిదగ్గర ఉన్నది నా దగ్గర లేదు.
అందరి విద్యార్ధులలాగా నా దగ్గర లేనిది ఎవరి దగ్గరైన ఉంటే నాకు అది కావాలనిపిస్తుంది. అప్పుడు ఒక నిర్ణయం తీసుకునాను, వీరితో స్నేహంచేయాలనుకునాను. నేను ఆ నిర్ణయం తీసుకున రెండు వారాలకు మేమందరం విద్యార్ధుల యూనియన్ లో కూర్చుని ఉన్నాం: ఆ విద్యార్ధులు మరియు ఇద్దరు ఉపాధ్యాయులతో కలిసిన మా సంభాషణ మళ్ళికొనసాగింది.

జీవితము యొక్క మార్పు గురించి అడగటం - మంచి మార్పు

వాళ్ళు నన్ను చాలా టెన్షన్ పెడుతున్నారు, కాబట్టి ఆఖరికి ఆతురత తట్టుకోలేక చాలా అందముగా ఉన్న ఒక విద్యార్ధిని వైపు చూసి (నేననుకునేవాడిని, క్రైస్తవులు చాలా చండాలంగా ఉంటారని) నా కుర్చీకి వెనకకు వాలాను,(ఎందుకంటే నేను బాగా ఆతురతగా వున్నానని వారు గ్రహించకూడదనుకునాను) మీ జీవితాలను మార్చనది ఏమిటి? అని అడిగాను. మన కాలేజీలో ఉన్న వారందరికంటే మీ జీవితాలు ఎందుకింత ప్రత్యేకముగా ఉన్నాయి? అని అడిగాను.
అక్కడ ఉన్న యవ్వనస్తురాలు చాలా నమ్మకంకలిగినది. ఆమె, నేనడిగిన ప్రశ్నకు నా కళ్ళలోకి సూటిగా చూసి నేను ఊహించలేని నా సమస్యలకు పరిష్కారం గురించి రెండు పదాలు చెప్పింది: " యేసుప్రభువు."
వెంటనే నేను," బాబోయ్, నాకు ఆ చెత్తను ఇవ్వదు,నేను మతాలను బట్టి విసిగిపోయాను,చర్చ్ అంటే విసుగొచ్చెసింది,బైబిల్ అంటే చిరాకు వచ్చింది. నాకు ఆ చెత్తంతా ఇవ్వద్దు ", అని అన్నాను.
ఆమె వెంటనే సూటిగా ఇలా చెప్పటం మొదలు పెట్టింది," నేను మతం అనలేదు, నేను యేసుక్రీస్తు అన్నాను." నాకు ఇంతవరకూ తెలియని ఒక విషయం స్పష్టం చేసింది. క్రైస్తవ్యం మతం కాదు. మతం అంటే మానవుడు తన మంచి పనల ద్వారా దేవుడిని చేరటం: క్రైస్తవ్యంలో దేవుడు మానవుల యొద్దకు యేసుక్రీస్తు ద్వార వచ్చి దేవునితో సంబంధం కలిగియుండేలా చేయటం.
ప్రపంచంలో ఉన్న వారందరికంటే కాలేజీల్లో వున్న వారికే క్రైస్తవ్యం పట్ల ఎక్కువ చెడ్డ అభిప్రాయాలు ఉంటాయి. కొంతకాలం క్రిందట నేను ఒక అధ్యాపకుని సహకారిని కలిశాను, ఆయన ఒక డిగ్రీపట్టా పొందే సెమినార్లో ఇలా అన్నాడు,"ఎవరైతే చర్చికి వెళ్ళతారో వారు క్రైస్తవులుగా మారిపోతారు అని." అందుకు నేను ఇలా అన్నాను," కారులషడ్ లోకి నడిచిన ప్రతి ఒకడు కారులాగా మారిపోడు కాదా?" క్రీస్తునందు నిజముగా విశ్వాసముంచినవాడె క్రైస్తవుడు అని నాకు చెప్పబడింది.
నేను క్రైస్తవ్యాన్ని గమనిస్తూ ఉండగ నా నూతన స్నేహితుడు యేసుప్రభువు జీవితాన్ని ఙ్ఞానంతో పరిశోధించమని సవాలు చేశాడు. నేను చేసిన పరిశోధనలో తెలుసుకున్నదేమిటంటే, బుద్ధుడు, మొహమద్ మరియు ఎప్పుడు కూడా నేను దేవుని అని అనలేదు, కాని యేసుప్రభువారు తానే దేవుడని అన్నారు. యేసుప్రభువారి దైవత్వమును కరుణించి పరిశీలన చెయ్యమని నా స్నేహితులు చెప్పారు. నా స్నేహితులు ధృడముగా నమ్మిందేమిటంటే యేసుక్రీస్తు, నరుడిగా వచ్చిన దేవుడని, మానవులు పాపముల నిమ్మిత్తము శిలువమీద మరణించారని, ఆయన పాతిపెట్టబడ్డారని, మూడుదినముల తర్వాత తిరిగి లేచాడని,కాబట్టి ఆయన ఒక వ్యక్తి జీవితాన్ని మార్చగలడు.
ఇది అబద్దం అనుకునేవాడిని, నిజానికి, క్రైస్తవులందరు పిచ్చివాళ్ళనుకున్నను. నేను కొంతమందిని కలిశాను కూడా. క్లాసులో క్రైస్తవుడు లెగిచి ఏదైనా ప్రశ్న అడిగితే వాడిని ఎగతాలి చేసి కించపరచేవాడిని, అధ్యాపకులను ముఖము మీద కొట్టాలనిపించేది. క్రైస్తవుడకి ఆలోచనశక్తి తక్కువ అనుకునేవాడిని
కాని మీరు మళ్ళీ మళ్ళీ నాకు సవాలు విసిరేవారు. ఆఖరికి, నేను వారి సవాలును ఒప్పుకున్నాను.గర్వంతో వాళ్ళను గెలుద్దాం, వారికి అధారాలు లేవు కదా అనుకున్నాను.పరిశోధించి చూడటానికి వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు అనుకున్నాను.
అనేక నెలల అధ్యాయనం, పరిశోధన తర్వాత నా మనస్సు చెప్పిన విషయం ఏమిటంటే యేసుప్రభు వారు నిజముగా దేవుడు. ఇది చాలా సమస్యను తెచ్చింది. నా మనసేమో ఆయన నిజమైన దేవుడు అని చెబుతుంది కాని నా ఆలోచనలు వేరే వైపు లాగేస్తున్నాయి.
నాకు అర్ధమైన విషయం ఏమిటంటే క్రైస్తవుడిగా మారటం అంటే నీ గర్వాన్ని పొగరును అణచివేయటం. యేసుక్రీస్తు నాకు సూటిగా సవాలు చేసిందేమిటంటే," ఆయనను నమ్మమని."ఆయన చెప్పిన మాటలను ఇలా చెప్పవచ్చు," సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక." యేసయ్య నిజముగా నీటిమీద నడిచారా, ఆయన నిజముగా నీళ్ళను ద్రాక్షరసముగా మార్చారా అనేటువంటి దాన్ని నేను పట్టించుకోలేదు. నాకున్న మంచి సమయ్యాన్ని నేను ఇంకా పాడు
చేసుకోవాలనుకోలేదు. ఆఖరికి నా మనస్సు నాతో చెబుతుంది ఏమిటంటే క్రైస్తవ్యం నిజం. నా ఆలోచనలు పరుగెడుతున్నాయి అని.

నా జీవితాన్ని నేను ద్వేషిస్తున్నాను

ఉత్సాహముగా ఉండేటువంటి ఆ క్రైస్తవుల మధ్యలో ఉండేటప్పుడు గొడవ పడుతూ ఉండేవాడిని. మీరు ఎప్పుడైన సంతోషముగా ఉన్నవారి మధ్యలో బాధగా వున్నట్లయితే ఆ భాద యొక్క విలువ నీకు బాగా అర్ధమవుతుంది.విద్యార్ధుల యూనియన్ అయిన వాళ్ళందరు చాలా సంతోషముగా ఉండేవాళ్ళు. కాని, నేను ఏమో చాలా బాధగా ఉంటూ వారి మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోతూ ఉండేవాడిని. కొనిసార్లు రాత్రిపది గంటలకు నిద్రించటానికి వెళ్ళినప్పటికి ఉదయం నాలుగు గంటల వరకు నిద్రపట్టేది కాదు. నేను పిచ్చివాడిని కాక మునుపే ఈ విషయానికి పరిష్కారం వెతకాలి అనుకున్నాను. ఆఖరిగా నా మనస్సు నా ఆలోచనలు కలిసాయి డెసెంబర్ -19- 1959 రాత్రి 8.30 నిమిషాలకు నేను విశ్వవిద్యాలయములో రెండవ సంవత్సరం చదువుతున్నాను నేను క్రైస్తవుడను అయ్యాను. ఆ రాత్రి నేను యేసుప్రభు వారితో సంబంధాన్ని స్థాపించటం కోసం నాలుగు విషయాల గురించి ప్రార్ధించాను. మొదటిగా " ప్రభువైన యేసు నా కోసం శిలువ మీద మరణించినందుకు నీకు కృతఙ్ఞతలు అన్నాను." "రెండవదిగా నీకు ఇష్టములేన్నటువంటి నా పాపాల్ని నీ సన్నిధిలో ఒప్పుకుని, నన్ను క్షమించి పూర్తిగా కడగమన్నాను." " మూడవదిగా నా హృదయపు ద్వారాన్ని తెరచి మరియు నా జీవితములో నీవు రక్షకుడవు, ప్రభుడవు అని నీ మీద నమ్మకము ఉంచుచున్నాను. నన్ను పూర్తిగా మార్చి వేసి నా జీవితాన్ని నీ ఆధీనములో ఉంచుకో. నన్ను నీవు ఎలాగైతే సృష్టించావో అటువంటి వ్యక్తిగా మార్చమని అన్నాను. ఆఖరిగా నేను చేసిన ప్రార్ధన ఏమిటంటే విశ్వాసము ద్వారా నా జీవితములోకి వచ్చినందుకు నీకు కృతఙ్ఞతలు." ఇది అఙ్ఞానముతో తీసుకున్నటువంటి నిర్ణయము కాదు. కాని, విశ్వాసముతో చరిత్ర యొక్క ఆధారముతో మరియు నీ వాక్యము యొక్క రుజువులతో తీసుకున్న నిర్ణయం.
మత సంబంధమైనటువంటి గొప్ప గొప్ప ఆత్మీయ అనుభవాల్ని అనేకమంది చెబుతూ ఉండగా మీరు వినే ఉంటారు. అయితే, నా ప్రార్ధన అయిపోయాక ఇటువంటివి ఏమి జరగలేదు. నిజానికి నేను ఈ నిర్ణయం తీసుకున్న తరువాత నేను ఇంకా వున్నాను. నాకు ఏదో గందరగోలముగా అనిపించింది. అమో, లేదు, దేంట్లోకి వెళ్ళి ఇరుక్కుపోయ్యావు? నిజానికి నాకు లోతైన ప్రదేశములో చివరకి వెళ్ళినట్టనిపించింది.(కొంతమంది కూడా నా గురించి ఇలానే ఆలోచిస్తునారేమో).

దేవుడు మరియు జీవితము యొక్క మార్పు, నిజమైన మార్పు

కాని, ఆరు నెలలలో ఒక సంవత్సరంనరకి నాకు అర్ధమైనది ఏమిటంటే నేను లోతులోనికి వెళ్ళలేదు, నా జీవితము మారిపోయింది. మిడ్ వెస్టరన్ విశ్వవిద్యాలయములోనికి చరిత్రకు సంబంధించిన విభాగములో నేను వాదించాను కూడా. నేను అన్నాను నా జీవితము మారిపోయింది అని. నేను మాట్లాడుతూ ఉండగా ఆయన ఆపి "మెక్ డోవెల్, ఈ 20వ శతాబ్దములో దేవుడు నిజముగా నిన్ను మార్చాడని అంటున్నావా? ఏ విషయములో నిన్ను మార్చాడు? " 45 నిమిషాల తరువాత ఇంకా చాలు ఆపు అన్నాడు. ఆ రోజు వాళ్ళతో చెప్పిన కొన్ని సంగతులు మీతో కూడా చెప్పాలనుకుంటునాను.
దేవుడు నా జీవితాన్ని మార్చివేసినటువంటి విషయాలలో ఒక విషయం ఏమిటంటే విశ్రాంతి లేని నా జీవితాన్నికి విశ్రాంతి కలిపించాడు. నేను ఎప్పుడు ఏదో ఒక ఆలోచనతో నింపబడుతూ ఉండేవాన్ని, కాలేజి క్యాంపస్ లో నడుస్తున్నప్పుడు నా మనస్సు నిండా తుఫానులాంటి ఆలోచనలతో మనస్సులో పోరాటం ఎప్పుడు జరుగుతూ ఉండేది. చదువుకోటానికి కూర్చున్నప్పుడు కూడా చదువుకోలేకపోయేవాడిని. కాని యేసుప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు నాకు విశ్రాంతి కలిగింది నన్ను తప్పుగా అర్ధం చేసుకోకండి. నేను సమస్యలు లేవని చెప్పటం లేదు. నేను యేసుప్రభు వారితో కలిగియున్నటువంటి ఈ సంబంధము సమస్యని తీసి వేయలేదు కాని, సమస్యలో నిలబడేటువంటి శక్తిని ఇచ్చింది. ఈ లోకములో మరి ఏ విషయమునకైనను ఈ సంబంధాన్ని విడిచిపెట్టలేను.
నా జీవితములో కలిగినటువంటి మార్పు ఏమిటంటే, నాకున్న చెడ్డకోపము పోయింది. ఎవరన్న నా వైపు కోపముగా చూస్తే నేను తట్టుకోలేకపోయేవాడని. నా మొదటి సంవత్సరములో నా కోపముతో ఒక వ్యక్తిని చంపేదాకా వెళ్ళాను. నాకున్న ఆలోచనలలో నాకున్న కోపాన్ని మార్చుకోలేకపోయాను.కాని, వుప్పుడు నాకు పూర్తిగా నా కోపం పోయింది. 14 సంవత్సరాల్లో కేవలం ఒకసారే కోపడ్డాను.(కాని అప్పుడు వచ్చిన కోపము మళ్ళీ ఆరు సంవత్సరముల వరకు అలా జరగకుండా జాగ్రత్త పడ్డాను).

ద్వేషములో నుండి మంచి మార్పు

నా జీవితములో నేను ద్వేషము అనే విషయములో నేను మార్పు పొందాను. నేను ఏమి గర్వపడటలేదు కాని, మనలో అనేకమందికి వాళ్ళ జీవితములలో ఈ విషయములలో మార్పు కావలసివుంది. ఆ మార్పుకి కారణం: యేసు ప్రభువారితో సంబంధం కలిగి ఉండటం. నా జీవితములో చాలా ద్వేషము ఉండేది ఇది ఎవరు బయటకు చూపించేది కాదు. కాని, లోలోపల ఇది పెరుగుతూనే ఉండేది. నేను ప్రజల మీద వేరు వేరు సందర్భాలలో, పరిస్థితులలో ద్వేషం పెట్టుకునే వాడిని.
ప్రపంచములో నేను ద్వేషించిన వారందరిలోకి నేను ఎక్కువగా ద్వేషించిన వ్యక్తి నా తండ్రి. నేను ఆయన ధైర్యాన్ని ద్వేషిస్తూ ఉండేవాన్ని. నా దృష్టిలో ఆయన ఒక త్రాగుబోతు. మా ప్రాంతంలో అందరికి మా నాన్న త్రగుబోతు అని తెలుసు. నా స్నేహితులు అనేకసార్లు నా తండ్రి వీధులలో తిరుగుతునాడని జోకులు వేస్తూ ఉండేవాళ్ళు. ఈ విషయము నన్ను బాధపెడుతుందని వారు ఎప్పుడు ఆలోచించలేదు. మిగతా వాళ్ళతో కలిసి బయటకి నవ్వుతూ ఉండేవాని కాని నిజానికి లోపల ఏడుస్తూ ఉండేవాన్ని. మా ఇంటి వెనకాల వున్నటువంటి పసువుల పాకలో నా తల్లిని పడేసి మా న్నాన కొడుతూ ఉండటం చుసేవాడిని. ఆమె ఆ పసువుల మధ్యలో పడిపోయి లెగవలేక బాధపడుతూ ఉండటం అనేక సార్లు గమనించాను.నా చుట్టూ స్నేహితులు వున్నప్పుడు, మా న్ననని బయటకు తీసుకువెళ్ళి పసువుల పాకలో కట్టేసి ఎగతాళి చేస్తూ ఉండేవాని. నేను ద్వేషించినంతగ ఎవ్వరు వాళ్ళ తండ్రులను ద్వేషించి ఉండరేమో.
యేసుప్రభు వారిని నా రక్షకునిగా అంగీకరించిన తరువాత ఆయన నా జీవితములోనికి వచ్చి ఆయన బలమైన ప్రేమతో నా జీవితాన్ని తలకిందులుగా మార్చేశాడు. ఇప్పుడు నేను మా నాన్న గారి కళ్ళలోకి చూసి నాన్న నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పగలను.
నేను ప్రైవేట్ విశ్వవిద్యాలయానికి మార్చుకున తరువాత నాకు ఒక భయంకరమైన కార్ యాక్సిడెంట్ జరిగింది. నా మెడ బెనికిన కారణాన నన్ను ఇంటికి తీసుకువెళ్ళటం జరిగింది. నా తండ్రి నా గదిలోకి వచ్చి అన్న మాట నా జీవితములో ఎప్పటికి మర్చిపోలేను. ఆయన అన్నారు," కుమారుడ నాలాంటి తండ్రిని నీవు ఎలా ప్రేమించగలుగుతున్నావు?, నేనన్నాను ఆరు నెలలకు ముందు నేను నిన్ను అవమానించాను." తరువాత యేసుప్రభు వారితో నా అనుభవం గురించి వివరించాను."యేసుప్రభు వారిని నా జీవితములోనికి ఆహ్వానించాను నాన్న గారు. ఏమి జరిగిందో పూర్తిగా వివరించలేనేమో గాని ఆయనతో నాకున్న సంబంధమే నన్ను ప్రేమించేలాగా, నిన్ను మాత్రమే కాక అనేకమందిని నా జీవితములోనికి అంగీకరించేలాగా చేసింది.”
45 నిమిషాల తరువాత నా జీవితములో ఎప్పుడు జరగనటువంటి ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. మా కుటుంబంలో వున్న వ్యక్తి, ఎవరి కళ్ళలోకి అయితే నేను చూసి మాట్లాడలేనో, ఆయన నాతో ఇలా అన్నాడు: కుమారుడా నీ జీవితములో వచ్చిన మార్పు నా జీవితములో కూడ రావటానికి నేను దేవునికి అవకాశం ఇస్తునాను." వెంటనే ఆయన మోకరించి నా తండ్రి నాతో పాటు ప్రార్ధన చేసి యేసుప్రభుని తన పాపాలు క్షమించమని అడిగాడు.
సాధారణంగా కొన్ని రోజులకు, వారాలకు, నెలలకు లేక సంవత్సరానికి గాని కొంత మంది మారరు. కాని, నా తండ్రి యొక్క జీవితం నా కళ్ళముందే మారిపోయింది. ఎవరో లైట్ వెసినట్టుగా ఉంది. నా జీవితంలో అంతకముందు కాని తరువాత కాని అటువంటి మార్పును చూడలేదు. మళ్ళి మా నాన్న తాగలేదు. కేవలం ఒకసారి మాత్రమే ఆయన బ్రాందీ సీసా తీసుకుని ఆయన నోటి దగ్గర దాక తీసుకువచ్చి కిందపెట్టేసాడు. యేసయ్యతో సంబంధం జీవితాలను మార్చివేస్తుంది.

జీవితం మారిపోవటం: మంచి మార్పు

నువ్వు క్రైస్తవుడని చూసి నవ్వచ్చు, ఎగతాళిచేయవచ్చు కాని సత్యమేమిటంటే జీవితాలు మారతాయి. నీవు యేసయ్యని వెంబడిస్తున్నట్లయితే నీ జీవితాన్ని గమనించు, నీ స్వభావాన్ని గమనించు ఎందుకంటే యేసయ్య నీ జీవితాన్ని మారుస్తాడు కాబట్టి.
నేను చేసిన ప్రార్ధన నీకు సహాయపడుతుందనుకుందనుకుంటాను." ప్రభువైన యేసు, నాకు నువ్వు కావాలి. నా కోసం శిలువపై చనిపోయినందుకు కృతఙ్ఞతలు. నన్ను క్షమించి నా పాపములను కడుగు. ఈ క్షణంలో నీవు నా రక్షకునిగా ప్రభుగా నమ్ముచునాను. నువ్వు నన్ను ఎలా అయితే సృష్టించావో అలా నన్ను మార్చు

Friday, 16 March 2018

A story.....about memory loss



" ఏమిటోనోయ్! అస్తమానూ పెన్ను ఎక్కడ పెట్టానో మరచిపోతూ ఉంటాను" .

" ఎందుకు అలా ? " .

" ఏమిటో మరి ఈ మతి మరుపు ! అందుకే నేను ఎప్పుడోఖరీదైన పెన్నులు వాడడం మానేశాను . చీప్ పెన్ను మాత్రమె వాడుతున్నాను . అది మరిచిపోయి పారేసినా బాధ అనిపించదులే ! అయితే నా బాధ ఈ మతిమరుపు గురించే ! "
.
.

" నేను ఒక సలహా ఇవ్వనా ? "

" మతిమరుపు పోతుందా ?".

" చెప్పలేను ! నీ మీద ఆధారపడి ఉంటుంది !"
.
ఏమిటది ?
.
.
" నువ్వు కొనగలిగినంత అత్యంత ఖరీదు అయిన పెన్ను కొని వాడుతూ ఉండు . అప్పుడు కూడా నువ్వు మరిచిపోతావా? , నీ మరుపు పోతుందా ? చూద్దాము "
.
..
" తప్పకుండా చేస్తాను "
.
.

.
.
ఆర్నెల్ల తర్వాత స్నేహితుడు ఫోన్ చేసి పెన్ను మరిచిపోతున్నావా ? అని అడిగాడు .
.
.
.

.
" అబ్బే ! నువ్వు చెప్పాక 22 కేరట్ల బంగారం పెన్ను కొన్నాను . దాని విషయం లో చాలా జాగ్రత్తగా ఉంటున్నాను . ఈ ఆరునెలల్లో ఒక్క రోజు కూడా నేను దానిని ఎక్కడా మర్చిపోలేదు "
.
.
.
" నువ్వు పెన్ను మర్చిపోకపోడానికి కారణం నువ్వు దానికి ఇచ్చిన విలువ ."
.
.
.
మనం దేనికి విలువ ఇస్తామో దానిపట్ల మనం జాగ్రత్తగా ఉంటాము .
.

వస్తువుకు విలువ ఇస్తే దాన్ని కోల్పోము
.

ఆరోగ్యానికి విలువ ఇస్తే ఏమి తినాలో , ఏమి తినకూదదో , ఎంత తినాలో , ఎప్పుడు తినాలో అన్నీ జాగ్రత్తగా ఉంటాము
.

*స్నేహానికి విలువ ఇస్తే స్నేహితుడిని గౌరవిస్తాము*
.

*డబ్బుకు విలువ ఇస్తే ఆచి తూచి ఖర్చు పెడతాము*
.

*కాలానికి విలువ ఇస్తే టైం వేస్ట్ చెయ్యము*
.

*బంధాలకు విలువ ఇస్తే వాటిని  తెంచుకోము*
.

దేవుని వాక్యము నకు విలువ నిస్తే చదవడానికి , వినడానికి, ధ్యానించడానికి సమయం కేటాయిస్తాం.



.....జీవిత సత్యం.
       ### * ###

Thursday, 15 March 2018

మెరిసే చర్మం కోసం...... for better glow skin

ఈ 8 DIY ఫేస్ ప్యాక్స్ ను ఈ సమ్మర్ లో ప్రయత్నిస్తే వేసవి కాలంలో ఎదురయ్యే చర్మ సమస్యలను నివారించవచ్చు

కాబట్టి, ఈ సీజన్ లో చర్మ సంరక్షణకై మరింత శ్రద్ధ కనబరచడం అవసరం. తద్వారా, కాంతివంతమైన చర్మంతో మీరు మెరిసిపోతారు. హోమ్ రెమెడీస్ అనేవి చర్మ సంరక్షణలో ముఖ్య పాత్రను పోషిస్తాయి.
ఇక్కడ, వేసవి కాలంలో మీరు ప్రయత్నించవలసిన కొన్ని హోంమేడ్ ఫేస్ ప్యాక్స్ గురించి వివరించాము. వీటిని ప్రయత్నించడం ద్వారా వేసవి కాలంలో ఎదురయ్యే కొన్ని చర్మ సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు.

1. గ్లోయింగ్ స్కిన్ కోసం లెమన్:

1. గ్లోయింగ్ స్కిన్ కోసం లెమన్:

కావలసిన పదార్థాలు:
1 టేబుల్ స్పూన్ నిమ్మరసం
1 టేబుల్ స్పూన్ తేనె
1 ఎగ్ వైట్
ఎలా వాడాలి:
ఎగ్ లోంచి ఎగ్ వైట్ ను సెపరేట్ చేయండి. అందులో ఒక టేబుల్ స్పూన్ లెమన్ మరియు ఒక టేబుల్ స్పూన్ తేనెను జోడించి బాగా మిక్స్ చేయండి. ఈ ప్యాక్ ను ముఖంపై అలాగే మెడపై అప్లై చేయండి. 20 నిమిషాల పాటు అలాగే ఉంచి నార్మల్ వాటర్ తో శుభ్రపరచండి. లెమన్ మరియు తేనెలో ఎక్స్ఫోలియేటింగ్ ఏజెంట్స్ కలవు. ఇవి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. చర్మంలో నిగారింపును తీసుకువస్తాయి.

2. గుమ్మడి ఫేస్ మాస్క్

2. గుమ్మడి ఫేస్ మాస్క్

కావలసిన పదార్థాలు:
అర కప్పు గుమ్మడి గుజ్జు
ఒక టేబుల్ స్పూన్ తేనె
ఒక ఎగ్
ఒక టేబుల్ స్పూన్ ఆల్మండ్ మిల్క్ (ఆప్షనల్)
ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సిడర్ వినేగార్
ఎలా వాడాలి:
అర కప్పు గుమ్మడి గుజ్జులో ఎగ్ ను కలపండి. ఈ రెండిటినీ బాగా బ్లెండ్ చేయండి. ఇప్పుడు, ఇందులో తేనె, ఆల్మండ్ మిల్క్ మరియు ఆపిల్ సిడర్ వినేగార్ ను కలిపి చిక్కటి మిశ్రమంగా తయారుచేయండి. ఈ మిశ్రమాన్ని ముఖంపై అలాగే మెడపై అప్లై చేయండి. 20 నిమిషాల తరువాత నార్మల్ వాటర్ తో రిన్స్ చేయండి. ఆ తరువాత మాయిశ్చరైజర్ ను అప్లై చేయండి.

3. మింట్ మరియు టర్మరిక్ ఫేస్ ప్యాక్

3. మింట్ మరియు టర్మరిక్ ఫేస్ ప్యాక్

కావలసిన పదార్థాలు:
6-7 మింట్ లీవ్స్
ఒక టీస్పూన్ టర్మరిక్ పౌడర్
ఎలా వాడాలి:
కొన్ని మింట్ లీవ్స్ ను బ్లెండ్ చేసి అందులో ఒక చిటికెడు పసుపును జోడించండి. ఇందులో గోరువెచ్చటి నీటిని కలిపి పేస్ట్ ను తయారుచేయండి. ఈ మిక్శ్చర్ ను ముఖానికి అప్లై చేసి దాదాపు 10 నుంచి 15 నిమిషాల వరకు అలాగే ఉంచండి. నార్మల్ వాటర్ తో రిన్స్ చేయండి. మింట్ మరియు పసుపులో యాంటీ సెప్టిక్ ప్రాపర్టీస్ కలవు. ఇవి పింపుల్స్ ను తగ్గిస్తాయి. అలాగే, చర్మాన్ని కోమలంగా మరియు మృదువుగా మారుస్తాయి.

4. పెరుగు మరియు గ్రామ్ ఫ్లోర్ ఫేస్ ప్యాక్

4. పెరుగు మరియు గ్రామ్ ఫ్లోర్ ఫేస్ ప్యాక్

కావలసిన పదార్థాలు:
4 టేబుల్ స్పూన్ల పెరుగు
2 టేబుల్ స్పూన్ల గ్రామ్ ఫ్లోర్
ఎలా వాడాలి:
పెరుగులో గ్రామ్ ఫ్లోర్ ని కలపండి. వీటిని బాగా పేస్ట్ లా తయారుచేసుకోండి. ఈ పేస్ట్ ను ముఖంపై అప్లై చేయండి. ఈ పేస్ట్ లో చిటికెడు పసుపును కూడా కలపవచ్చు. ఈ ప్యాక్ ను 15 నుంచి 20 నిమిషాల తరువాత నార్మల్ వాటర్ తో తొలగించాలి. ఈ ప్యాక్ అనేది స్కిన్ ట్యానింగ్ నుంచి రక్షణనిస్తుంది.

5. బనానా ఫేస్ మాస్క్:

5. బనానా ఫేస్ మాస్క్:

కావలసిన పదార్థాలు:
అరకప్పు మ్యాష్డ్ బనానా
ఒక టేబుల్ స్పూన్ తేనె
ఎలా వాడాలి:
అర కప్పు మ్యాష్డ్ బనానాను తీసుకుని ఇందులో ఒక టేబుల్ స్పూన్ తేనెను జోడించాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని స్కిన్ పై ఈవెన్ గా అప్లై చేయాలి. ఆరాక గోరువెచ్చటి నీటితో మీ చర్మాన్ని శుభ్రపరచుకోవాలి. ఈ ప్యాక్ అనేది చర్మాన్ని హైడ్రేట్ చేసి డ్రై స్కిన్ నుంచి రక్షణను అందిస్తుంది.

6. టమాటో పల్ప్ ఫేస్ ప్యాక్

6. టమాటో పల్ప్ ఫేస్ ప్యాక్

కావలసిన పదార్థాలు:
అర కప్పు టమాటో పల్ప్
ఒక టీస్పూన్ తేనె
ఎలా వాడాలి:
ఒక పాత్రలోకి టమాటో పల్ప్ ని తీసుకుని అందులో తేనెను కలపాలి. ఈ ప్యాక్ ను చర్మంపై ఈవెన్ గా అప్లై చేయాలి. ఇలా 20 నిమిషాల పాటు ఉండనివ్వాలి. ఆ తరువాత రిన్స్ చేసి చర్మాన్ని టవల్ తో తుడవాలి. టమాటోలో చర్మంపై పేరుకున్న డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించే సామర్థ్యం కలదు. అలాగే స్కిన్ ను ట్యానింగ్ నుంచి సంరక్షించే సామర్థ్యం కూడా టొమాటోలో లభ్యమవుతుంది.

7. మిల్క్ మరియు తేనే ప్యాక్

7. మిల్క్ మరియు తేనే ప్యాక్

కావలసిన పదార్థాలు:
1 టేబుల్ స్పూన్ మిల్క్
1 టేబుల్ స్పూన్ తేనె
ఎలా వాడాలి:
తేనెను అలాగే పాలను ఒక బౌల్ లోకి తీసుకుని బాగా కలపాలి. పచ్చి పాలకు బదులుగా మిల్క్ పౌడర్ ను కూడా వాడవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖంపై అలాగే మెడపై అప్లై చేయాలి. 15 నిమిషాల తరువాత నార్మల్ వాటర్ తో శుభ్రపరచాలి. కొంత మాయిశ్చరైజర్ ను అప్లై చేయడం మరచిపోకండి.

8. కుకుంబర్ ఫేస్ మాస్క్

8. కుకుంబర్ ఫేస్ మాస్క్

కావలసిన పదార్థాలు
హాఫ్ కుకుంబర్
ఒక స్పూన్ షుగర్
ఎలా వాడాలి:
కుకుంబర్ ను గుజ్జులా బ్లెండ్ చేసుకోండి. కుకుంబర్ గుజ్జులో ఒక స్పూన్ షుగర్ ను జోడించండి. ఈ మాస్క్ ను ముఖంపై అప్లై చేసి పది నిమిషాలపాటు అలాగే ఉంచండి. ఆ తరువాత చల్లటి నీటితో చర్మాన్ని శుభ్రపరచుకొని టవల్ తో తడిని తుడవండి. ఈ మాస్క్ ను ఒకసారే తయారుచేసి రిఫ్రిజిరేటర్ లో స్టోర్ చేసుకుంటే ఇంకో సారి వాడుకోవచ్చు.

Wednesday, 14 March 2018

సెటైర్.....

ఇప్పుడు ఉన్న ......ఈకలియుగంలో.....

అమ్మ నాన్నలు అనాథాశ్రమంలో .......

పిల్లలు అమెరికాలో .........

స్నేహితులు ఫేస్  బుక్ లో........

 పలకరింపులు వాట్సాప్ లో.......

భార్య టీవీ లో.........

 భర్త స్మార్ట్ ఫోన్ లొ .......

పిల్లలు వీడియొ గేమ్ లో..........

పెద్దలు క్యాండీ క్రష్ లో............

రైతులు ఉరికంభంలో .........

దళారి ఊరేగింపులలో ..........

విద్యార్థులు విహారాలలో..........

గురువులు వ్యాపారాలలో ..........

అప్పు పుచ్చుకున్నవాడు అద్దాల మేడలో .......

 ఇచ్చినవాడు పిచ్చాసుపత్రులలో ........

నీతిమంతుడు పుస్తకాలలో ...........

నీతిలేని వాడు రాజకీయాలలో ..........

ఇదే కలియుగం పక్వానికి వచ్చిందనడానికి నాంది....

ఇది ముమ్మాటికి  నిజం.

WHY SHOULID I BELIVE BIBLE..బైబిల్ ను ఎందుకు నమ్మాలి...?

బైబిల్ ను 1500 సంవత్సరాల వ్యవధిలో, 40 రచయితలు వ్రాశారు. ఇతర మత రచనలకు భిన్నంగా, బైబిల్ వాస్తవిక సమాచార శ్రవంతి వలె నిజమైన సన్నివేశాలు, స్థానములు, ప్రజలు మరియు చర్చ కలిగియుంటుంది. చరిత్రకారులు మరియు పురావస్తుశాస్త్రజ్ఞులు దీని యొక్క నిజాయితీని మరలా మరలా నిర్థారించారు.
రచయితల యొక్క సొంత రచనా శైలిలను మరియు వ్యక్తిత్వాలను ఉపయోగిస్తూ, ఆయన ఎవరో మరియు ఆయనను తెలుసుకొనుట ఎలా ఉంటుందో దేవుడు మనకు చూపుతున్నాడు.
బైబిల్ యొక్క ఈ 40 రచయితలు స్థిరముగా ఒక మూల సందేశమును బయలుపరచారు: మనలను సృష్టించిన దేవుడు మనతో అనుబంధం కలిగియుండాలని ఆశించుచున్నాడు. ఆయనను తెలుసుకొనుటకు మరియు ఆయనను నమ్ముటకు మనలను ఆయన పిలుస్తున్నాడు.
బైబిల్ కేవలం మనలను ప్రోత్సహించుట మాత్రమే కాదుగాని, అది మనకు జీవమును దేవుని వివరిస్తుంది. మన యొద్ద ఉన్న ప్రశ్నలన్నిటికీ అది జవాబు ఇవ్వకపోవచ్చుగాని, కావలసినన్ని జవాబులు ఇస్తుంది. ఉద్దేశము మరియు కరుణతో ఎలా జీవించాలో అది మనకు చూపుతుంది. ఇతరులతో ఎలాంటి అనుబంధం కలిగియుండాలి. శక్తి, దిశ కొరకు దేవునిపై ఆధారపడి మన పట్ల ఆయన ప్రేమను అనుభవించుటకు అది మనలను పురికొల్పుతుంది. నిత్య జీవమును ఎలా కలిగియుండగలమో కూడా బైబిల్ మనకు చెబుతుంది.
పలు విభాగాల రుజువులు బైబిల్ యొక్క చారిత్రక ఖచ్చితత్వమును మరియు దాని దైవిక రచనను సమర్థిస్తాయి. మీరు బైబిల్ ను నమ్ముటకు కొన్ని కారణాలు ఇవి.

బైబిల్ యొక్క చారిత్రక ఖచ్చితత్వమును పురావస్తుశాస్త్రము నిర్థారిస్తుంది.

పురావస్తుశాస్త్రవేత్తలు తరచుగా బైబిల్ లో ప్రస్తావించబడిన ప్రభుత్వ అధికారులు, రాజులు, పట్టణములు, మరియు పర్వముల పేర్లు కనుగొన్నారు—కొన్ని సార్లు చరిత్రకారులు అట్టి ప్రజలు లేక స్థలములు ఉన్నాయని ఆలోచించనప్పుడు కూడా. ఉదాహరణకు, బెతేస్థ అను కోనేరు యొద్ద యేసు ఒక కుంటివాడిని స్వస్థపరచుటను గూర్చి యోహాను సువార్త చెబుతుంది. వాక్యభాగము కోనేరు యొద్దకు వెళ్లుటకు ఉన్న ఐదు ద్వారములను గూర్చి కూడా చెబుతుంది. ముందుగా అట్టి కోనేరు ఉన్నదని పండితులు భావించలేదు, కాని తరువాత భూమిలో 40 అడుగుల లోతున పురావస్తుశస్త్రవేత్తలు ఐదు ద్వారములతో సహా ఆ కోనేరును కనుగొన్నారు.1
బైబిల్ లో చారిత్రక వివరములు విరివిగా ఉన్నాయి కాబట్టి, దానిలో ఉన్న ప్రతి దానిని పురావస్తుశాస్త్రం కనుగొనలేదు. అయితే, ఏ ఒక్క పురావస్తుశాస్త్ర ఆవిష్కరణ కూడా బైబిల్ కథనాలను ఖండించేదిగా లేదు.2
భిన్నంగా, పత్రకారుడైన Lee Strobel Book of Mormon పై ఈ వ్యాఖ్యలు చేశాడు: “అమెరికాలో చాలా కాలం క్రితం జరిగాయని అది చెప్పుచున్న సన్నివేశాలకు పురావస్తుశాస్త్రం నిర్థారించలేకపోయింది. మొర్మన్లు చేసే దావలలో ఏమైనా సత్యముందా అని విచారించమని Smithsonian Institute కు నేను వ్రాసాను, మరియు వారు ఏకగ్రీవంగా చెప్పిన మాట ఏమిటంటే ‘నూతన లోకము యొక్క పురావస్తు శాస్త్రమునకు మరియు ఆ పుస్తకములోని విషయాలకు ఎలాంటి అనుబంధం లేదని’ పురావస్తుశాస్త్రవేత్తలు గమనించారు.” Book of Mormonలో ప్రస్తావించబడిన పట్టణములు, వ్యక్తులు, పేర్లు, లేక ప్రాంతములను పురావస్తుశాస్త్రవేత్తలు ఎన్నడు గుర్తించలేదు.3
క్రొత్త నిబంధనలోని అపొస్తలుల కార్యములలో లూకా ప్రస్తావించిన అనేక పురాతన ప్రాంతములు పురావస్తుశాస్త్రము గుర్తించింది. “మొత్తం, లూకా ముప్పై రెండు దేశములను, యాబై-నాలుగు పట్టణములను మరియు తొమ్మిది ద్వీపములను ఎలాంటి తప్పు లేకుండా ప్రస్తావిస్తున్నాడు.”4
బైబిల్ ను గూర్చి కొన్ని తప్పు-సిద్ధాంతాలను కూడా పురావస్తుశాస్త్రము ఖండించింది. ఉదాహరణకు, కొన్ని కళాశాలలో నేటికి కూడా మోషే ధర్మశాస్త్రమును (బైబిల్ యొక్క మొదటి ఐదు పుస్తకాలు) వ్రాసియుండడు, ఎందుకంటే ఆ కాలంలో వ్రాయుట ఇంకా కనుగొనబడలేదు. పురావస్తుశాస్త్రవేత్తలు బ్లాకు స్టేలే కనుగొన్నారు. “అది మేకు ఆకారంలో పదములు కలిగి దానిపై హమురబి నియమాలు స్పష్టముగా వ్రాయబడియున్నాయి. అది మోషే-తరువాత వ్రాయబడిందా? లేదు! అది మోషే కాలమునకు ముందే వ్రాయబడింది. అంతే కాదు, అది అభ్రాహాము కాలము కంటే ముందు కాలానికి చెందినది (క్రీ.పూ. 2,000). అది మోషే రచనలకు కనీసం మూడు శతాబ్దాల ముందు వ్రాయబడినది."5
పురావస్తు శాస్త్రం తరచుగా బైబిల్ యొక్క చారిత్రక ఖచ్చితత్వమును నిర్థారిస్తుంది.

బైబిల్ వాస్తవికంగా ఎలా వ్రాయబడిందో నేడు కూడా అలానే ఉంది.

బైబిల్ “చాలా సార్లు” అనువదించబడినది కాబట్టి అది అనువాద ప్రక్రియలో మలినమైపోయిందని కొందరి ఆలోచన. అనువాదాలు వేరే అనువాదాల నుండి చేయబడితే ఇది నిజం కావచ్చు. కాని అనువాదాలు ఆదిమ హెబ్రీ, గ్రీకు మరియు అరమాయి భాషల నుండి కొన్ని వేల పురాతన ప్రతుల ఆధారంగా చేయబడినాయి.
1947లో నేటి ఇశ్రాయేలు దేశము యొక్క పశ్చిమ తీరమున పురావస్తుశస్త్రవేత్తలు కనుగొన్న “మృత సముద్ర ప్రతులు” నేటి పాత నిబంధన యొక్క ఖచ్చితత్వమును నిర్థారిస్తాయి. “మృత సముద్ర ప్రతులలో” పాత నిబంధన లేఖనములను గూర్చి మనం కలిగియున్న ఏ వ్రాతప్రతుల కంటే కనీసం 1,000 సంవత్సరములు పురాతనమైన లేఖనములు ఉన్నాయి. నేడు మనం కలిగియున్న ప్రతులను 1000 సంవత్సరాల పురాతన ప్రతులతో పోల్చితే, 99.5% సమ్మతి కలిగినదిగా ఉంటుంది. మిగిలిన .5% తేడా వాక్యము యొక్క అర్థమును మార్చకుండా చిన్న అక్షర దోషములు మరియు వాక్య వల్లికలోని తేడాలతో కూడినది.
క్రొత్త నిబంధన విషయంలో, అది మానవులు అత్యంత ఆధారపడదగిన పురాతన పుస్తకము.
పురాతన ప్రతులు అన్ని పాపిరస్ మీద వ్రాయబడినవి, మరియు దానికి ఎక్కువ మన్నిక లేదు. కాబట్టి ప్రజలు ఆ సందేశమును ఇతరులకు అందించుటకు వాటిని చేతి వ్రాత ద్వారా తిరిగి వ్రాసేవారు.
Few people doubt Plato వ్రాసిన “The Republic”ను ఎవరు సందేహించారు. అది Plato ద్వారా క్రీ.పూ. 380లో వ్రాయబడిన ఉత్తమమైన రచన. మన యొద్ద ఉన్న దాని కాపీ క్రీ.శ. 900కు చెందినది, అనగా అది వ్రాసిన 1,300 సంవత్సరాల తరువాత కాలమునకు చెందినది. కేవలం ఏడు కాపీలు మాత్రమే ఉనికిలో ఉన్నాయి.
Caesar యొక్క “Gallic Wars” షుమారుగా క్రీ.పూ. 100-44లో వ్రాయబడినవి. ఇప్పుడు మన యొద్ద ఉన్న కాపీలు దానికి 1,000 సంవత్సరాల తరువాత వ్రాయబడినవి. మన యొద్ద పది కాపీలు ఉన్నాయి.
క్రొత్త నిబంధన విషయానికొస్తే, అది క్రీ.శ 50-100లో వ్రాయబడింది, మరియు 5,000 కంటే ఎక్కువ కాపీలు ఉన్నాయి. అన్ని కూడా అవి వ్రాయబడిన 50-225 సంవత్సరాల వ్యవధికి చెందినవి. అంతే గాక, లేఖనముల విషయానికి వస్తే, శాస్త్రులు వాస్తవిక ప్రతులను చాలా జాగ్రత్తగా కాపీ చేశారు. పరిపూర్ణత కొరకు వారు ఆ పనిని మరలా మరలా పరీక్షించారు. క్రొత్త నిబంధన రచయితలు వ్రాసినది మరి ఏ పురాతన రచన కంటే భద్రంగా దాయబడినది. Caesar, Plato, Artistotle మరియు Homer యొక్క రచనల కంటే ఎక్కువగా యేసు జీవితము మరియు మాటలను గూర్చి మనం చదువు విషయములపై ఎక్కువ నమ్మకం ఉంచవచ్చు.

యేసు యొక్క సువార్త కథనములను నమ్ముటకు మరి కొన్ని కారణాలు.

యేసు జీవితమును గూర్చి క్రొత్త నిబంధన యొక్క నాలుగు రచయితలు తమ సొంత జీవిత చరిత్రలను వ్రాశాడు. వీటిని నాలుగు సువార్తలని పిలుస్తారు, క్రొత్త నిబంధన యొక్క మొదటి నాలుగు పుస్తకాలు. ఒక జీవిత చరిత్ర నమ్మదగినదో లేదో కనుగొనుటకు చరిత్రకారులు ఈ ప్రశ్న అడుగుతారు, “ఈ వ్యక్తిని గూర్చి ఇవే వివరణలు ఇంకా ఎంత మంది ద్వారా పేర్కొనబడినాయి?”
ఇది ఈ విధంగా పనిచేస్తుంది. మీరు అధ్యక్షుడైన John F. Kennedy యొక్క జీవిత చరిత్రలను సేకరిస్తున్నారని అనుకోండి. ఆయన కుటుంబమును, ఆయన అధ్యక్షతను, చంద్రునిపై మనుష్యుని పంపాలనే ఆయన ధ్యేయం, మరియు క్యూబాలోని మిస్సైల్ సమస్యను ఆయన శాసించిన విధానం గూర్చి వివరించిన అనేక జీవిత చరిత్రలను మీరు కనుగొనవచ్చు. యేసు విషయంలో, ఆయన జీవితమును గూర్చి అవే సత్యములను తెలుపు [పలు జీవిత చరిత్రలు ఉన్నాయా? ఉన్నాయి. యేసును గూర్చి వాస్తవాల యొక్క ఉదాహరణలు, మరియు ప్రతి జీవిత చరిత్రలలో అవి ఎక్కడ చూడవచ్చో ఇక్కడ ఇవ్వబడినాయి.
మత్తయిమార్కులూకాయోహాను
యేసు కన్యగర్భమందు జన్మించాడు1:18-25-1:27, 34-
ఆయన బెత్లేహేములో జన్మించాడు2:1-2:4-
అయన నజరేతులో జీవించాడు2:231:9, 242:51, 4:161:45, 46
యేసు బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా బాప్తిస్మము పొందాడు3:1-151:4-93:1-22-
ఆయన స్వస్థత కలిగించు ఆశ్చర్యక్రియలు చేశాడు4:24, etc.1:34, etc.4:40, etc.9:7
ఆయన నీటి మీద నడచాడు14:256:48-6:19
ఆయన ఐదు రొట్టెలు రెండు చేపలను ఐదు వేల మందికి పంచాడు14:76:389:136:9
యేసు సామాన్యులకు బోధించాడు5:14:25, 7:289:1118:20
ఆయన సమాజంలో వెలివేయబడిన
వారితో సమయం గడిపాడు
9:10, 21:312:15, 165:29, 7:298:3
ఆయన మత గురువులతో వాదించాడు15:77:612:568:1-58
మత గురువులు ఆయనను చంపాలని ప్రయత్నించారు12:143:619:4711:45-57
వారు యేసును రోమీయులకు అప్పగించారు27:1, 215:123:118:28
యేసు కొరడాలతో కొట్టబడ్డాడు27:2615:15-19:1
ఆయన సిలువవేయబడ్డాడు27:26-5015:22-3723:33-4619:16-30
ఆయన సమాధిలో పెట్టబడ్డాడు27:57-6115:43-4723:50-5519:38-42
యేసు మరణం నుండి తిరిగిలేచి
తన అనుచరులకు కనిపించాడు
28:1-2016:1-2024:1-5320:1-31
సువార్త జీవిత చరిత్రలలో రెండు అపొస్తలులైన మత్తయి మరియు యోహాను వ్రాశారు, వీరు యేసును వ్యక్తిగతంగా ఎరిగి ఆయనతో మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించిన పురుషులు. మిగిలిన రెండు సువార్తలను అపొస్తలుల యొక్క సన్నిహితులైన మార్కు మరియు లూకా వ్రాశారు. వారు వ్రాయుచున్న సత్యాలతో వారికి దగ్గర అనుబంధం ఉంది. వారు వ్రాయుచున్న సమయంలో, యేసు మాటలు విన్నవారు, ఆయన చేసిన అద్భుతములు చూసిన ప్రజలు బ్రతికే ఉన్నారు.
కాబట్టి ఆదిమ సంఘము నాలుగు సువార్తలను పూర్తిగా అంగీకరించారు, ఎందుకంటే దానిలో ఉన్నవి అప్పటికే యేసు జీవితమును గూర్చి అందరికి తెలిసిన విషయములు.
మత్తయి, మార్కు, లూకా మరియు యోహాను, ప్రతి సువార్త కూడా ఒక సమాచార స్రవంతి వలె, ఆ దిన సన్నివేశాలను వారి వారి దృష్టి కోణాలలో రచయితలు వ్రాసిన విధంగా ఉన్నాయి. వివరణలు ప్రతి రచయితకు విశేషమైనవి, కాని వాస్తవాలు మాత్రం సమ్మతం కలిగియున్నాయి.

సువార్తలు ఇందు నిమిత్తం వ్రాయబడినాయి.

యేసు మరణం మరియు పునరుత్థానం తరువాత ఆరంభ దినాలలో యేసును గూర్చి వ్రాత పూర్వకంగా జీవిత చరిత్రలు వ్రాయబడవలసిన పని లేదు. యెరూషలేము ప్రాంతములో జీవించుచున్నవారు యేసును చూశారు మరియు ఆయన పరిచర్య వారికి బాగుగా తెలుసు.6
అయితే, యేసును గూర్చిన వార్త యెరూషలేము వెలుపల వ్యాపించిన తరువాత, ప్రత్యక్ష సాక్షులు అక్కడ అందుబాటులో లేరు కాబట్టి, యేసు జీవితం మరియు పరిచర్యను గూర్చి ఇతరులకు బోధించుటకు వ్రాతపూర్వక చరిత్ర యొక్క అవసరము వచ్చింది.
యేసును గూర్చి మరి ఎక్కువ తెలుసుకోవాలని ఆశిస్తే, ఆయన జీవితమును గూర్చి ఈ వ్యాసం మంచి సారాంశమును ఇస్తుంది: గ్రుడ్డి నమ్మకమును మించినది.

క్రొత్త నిబంధన పుస్తకాలు ఎలా నిర్థారించబడినవి.

ఆదిమ సంఘము క్రొత్త నిబంధన పుస్తకాలు వ్రాయబడిన వెంటనే వాటిని అంగీకరించింది. ముందుగానే ప్రస్తావించినట్లు, రచయితలు యేసు యొక్క స్నేహితులు లేక తన సన్నిహిత అనుచరులు, మరియు వీరికి యేసు ఆదిమ సంఘము యొక్క నాయకత్వమును ఇచ్చాడు. మార్కు మరియు లూకా అపొస్తలుల యొక్క అనుచరులు, మరియు యేసు జీవితమును గూర్చి అపొస్తలుల యొద్ద ఉన్న సమాచారమును ఆయన పొందారు.
క్రొత్త నిబంధన యొక్క ఇతర రచయితలకు కూడా యేసు అనుచరులే: యాకోబు మరియు యూదా యేసు యొక్క సహోదరులు మరియు ఆరంభములో వారు ఆయనను నమ్మలేదు. పేతురు 12 మంది అపొస్తలులలో ఒకడు. పౌలు ఆరంభములో మత అధికారులలో సభ్యునిగా ఉండి క్రైస్తవ్యమునకు విరోధిగా ఉండి, యేసు మరణము నుండి తిరిగిలేచాడని నమ్మి యేసు యొక్క అనుచరుడైయ్యాడు.
క్రొత్త నిబంధన కథనాలు కొన్ని వేల మంది ప్రత్యక్ష సాక్షుల కథనాలతో నిర్థారించబడింది.
కొన్ని పుస్తకాలు కొన్ని వందల సంవత్సరాల తరువాత వ్రాయబడినప్పటికీ, అవి తప్పిదములని గుర్తించుట కష్టము కాలేదు. ఉదాహరణకు, యూదా సువార్త ఒక జ్ఞాస్తిక్ తెగ ద్వారా యూదా మరణించిన చాలా కాలం తరువాత షుమారుగా క్రీ.శ. 130-170లో వ్రాయబడినది. తోమా సువార్త కూడా క్రీ.శ. 140లో వ్రాయబడి, అపొస్తలుని పేరిట వ్రాయబడిన నకిలీ రచనకు మరొక ఉదాహరణగా ఉంది. ఇవి మరియు ఇతర జ్ఞాస్తిక్ సువార్తలు యేసు మరియు పాత నిబంధన యొక్క తెలిసిన బోధలకు వ్యతిరేకంగా ఉండి, చాలా సార్లు గొప్ప చారిత్రక మరియు భౌగోళిక తప్పిదములు కలిగినవిగా ఉన్నాయి. 7
క్రీ.శ. 367లో, Athanasius అధికారికంగా 27 క్రొత్త నిబంధన పుస్తకాలను నిర్థారించాడు (మనం నేడు కలిగియున్న పుస్తకాలే). వెంటనే తరువాత, Jerome మరియు Augustine అదే జాబితాను ప్రతిపాదించారు. అయితే ఎక్కువ మంది క్రైస్తవులు ఈ జాబితను అనుసరిస్తారని కాదు. క్రీస్తు తరువాత మొదటి శతాబ్దం నుండి ఈ పుస్తకాల జాబితాను చాలా వరకు సంఘమంతా గుర్తించింది.
సంఘము గ్రీకు మాట్లాడు ప్రాంతములను దాటి బయటకు వెళ్లినప్పుడు లేఖనములు అనువదించవలసిన అవసరత వచ్చినది, మరియు కొన్ని తెగలు తమ సొంత పవిత్ర పుస్తకాలను పుట్టించుచుండెను కాబట్టి, ఒక నిర్థారిత జాబితా చాలా అవసరమైనది.

యేసును గూర్చి బైబిల్ చెబుతున్న వాటిని చరిత్రకారులు నిర్థారిస్తారు.

భద్రపరచిన వాస్తవిక ప్రతుల యొక్క కాపీలు మాత్రమే కాదు, మన యొద్ద యూదా మరియు రోమా చరిత్రకారుల యొక్క సాక్ష్యములు కూడా ఉన్నాయి.
నజరేయుడైన యేసు అనేక ఆశ్చర్య క్రియలు చేశాడని, రోమీయుల ద్వారా హతమార్చబడ్డాడని, మరణము నుండి తిరిగిలేచాడని సువార్త కథనములు తెలియజేస్తున్నాయి. యేసు మరియు ఆయన అనుచరుల యొక్క జీవితమును గూర్చి అనేక పురాతన చరిత్రకారులు బైబిల్ కథనములను సమర్థిస్తున్నారు:
Cornelius Tacitus (క్రీ.శ. 55-120), మొదటి శతాబ్దం రోమా యొక్క చరిత్రకారుడు, పురాతన ప్రపంచం యొక్క అత్యంత ఖచ్చితమైన చరిత్రకారులలో ఒకనిగా గుర్తించబడినాడు.8 రోమా చక్రవర్తియైన నీరో “క్రైస్తవులు అని పిలువబడు తెగపై అత్యంత ఘోరమైన అరాచకాలు చేశాడు... వీరి పేరు క్రిష్టస్ [క్రీస్తు] నుండి వచ్చినది, ఆయన పొంతు పిలాతు చేతులలో తిబెరు చక్రవర్తి కాలంలో ఘోరమైన శిక్షను అనుభవించాడు....”9 అని Tacitus వ్రాశాడు.
యూదా చరిత్రకారుడైన Flavius Josephus (క్రీ.శ. 38-100) తన Jewish Antiquitiesలో యేసును గూర్చి వ్రాశాడు. “యేసు జ్ఞానవంతుడు, ఆశ్చర్యక్రియలు చేశాడు, అనేకులకు బోధించాడు, యూదులు మరియు గ్రీకుల నుండి అనుచరులను గెలచుకున్నాడు, మెస్సీయగా గుర్తించబడ్డాడు, యూదా నాయకుల నిందను పొందాడు, పిలాతుచే శిక్షను పొందాడు, పునరుత్థానుడని ఎంచబడ్డాడు”10 అని Josephus ద్వారా మనం నేర్చుకొనవచ్చు.
Suetonius, Pliny the Younger, మరియు Thallus కూడా క్రొత్త నిబంధన కథనాలకు అనుగుణంగా క్రైస్తవ ఆరాధన మరియు హింసను గూర్చి వ్రాశారు.
యూదుల Talmud కూడా యేసు జీవితములోని ముఖ్యమైన అంశములను సమర్థిస్తుంది. Talmud నుండి ఈ మాటలు, "యేసు వివాహమునకు వెలుపల జన్మించాడని, శిష్యులను సమకూర్చాడని, తన గూర్చి దైవదూషణ దావాలు చేశాడని, మరియు ఆశ్చర్య క్రియలు చేశాడని నేర్చుకొనుచున్నాము, కాని ఈ అద్భుతాలు దేవుని వలన గాక గారడీ వలన కలిగినవి.”11
ఎక్కువ మంది పురాతన చరిత్రకారులు రాజకీయ లేక సైన్య నాయకులపై దృష్టి ఉంచారని, రోమా సామ్రాజ్యంలో ఒక మూలన ఉన్న మత బోధకులను అంతగా పట్టించుకోలేదని గుర్తిస్తే ఇది ప్రాముఖ్యమైన సమాచారం. అయినను పురాతన చరిత్రకారులు (యూదులు, గ్రీకులు, మరియు రోమీయులు), వారు విశ్వాసులు కానప్పటికీ, క్రొత్త నిబంధనలో ఇవ్వబడిన ముఖ్యమైన సన్నివేశాలను చూపిస్తారు.

సువార్తలలో ఉన్నది నిజముగా యేసు చెప్పాడు మరియు చేశాడు అనునది ముఖ్యమైన విషయమా?

అవును. విశ్వాసమునకు విలువ ఉండుటకు, అది సత్యములపై ఆధారపడియుండాలి. అందుకు కారణం ఇది. మీరు లండన్ వెళ్లుటకు ఒక విమానం ఎక్కిన యెడల, ఆ విమానంలో ఇంధనం ఉందని, పైలోట్ తర్ఫీదు పొందినవాడని, మరియు ఆ విమానంలో తీవ్రవాదులు ఎవరు లేరని మీరు నమ్ముతారు. మీ విశ్వాసం మిమ్మును లండన్ కు తీసుకొనివెళ్లదు. మీ విశ్వాసం మిమ్మును విమానం ఎక్కించుటలో సహాయపడుతుంది. కాని మిమ్మును ఆ విమానం మరియు పైలట్ లండన్ కు తీసుకొని వెళ్తారు. మీరు గతంలో చేసిన విమాన ప్రయాణాలలోని మంచి అనుభూతులను నమ్మవచ్చు. కాని మీ మంచి అనుభూతులు మిమ్మును లండన్ తీసుకొని వెళ్లుటకు సరిపోవు. మీ విశ్వాసం యొక్క మూలం ప్రాముఖ్యమైనది—అది నమ్మశక్యమైనదేనా?
క్రొత్త నిబంధన యేసును గూర్చిన ఖచ్చితమైన, నమ్మదగిన కథనమేనా? అవును. క్రొత్త నిబంధనకు గొప్ప వాస్తవాల బలం ఉంది కాబట్టి మనం దానిని నమ్మవచ్చు. ఈ వ్యాసం క్రింది విషయాలను చూసింది: చరిత్రకారులు సమ్మతిస్తారు, పురావస్తుశాస్త్రం సమ్మతిస్తుంది, నాలుగు సువార్తలు అంగీకారంలో ఉన్నాయి, ప్రతుల యొక్క కాపీలు భద్రపరచుట గొప్ప విషయం, అనువాదాలలో ఉన్నత స్పష్టత ఉన్నది. మనం నేడు చదివేది నిజమైన రచయితలు వ్రాసిన నిజ జీవితాలలో నిజ స్థలములలో అనుభవించినది అని నమ్ముటకు ఇది మనకు బలమైన పునాదిని ఇస్తుంది.
రచయితలలో ఒకరైన యోహాను దీనిని ఈ విధంగా సారంశ రూపంలో చెబుతున్నాడు, "మరియు అనేకమైన యితర సూచకక్రియలను యేసు తన శిష్యులయెదుట చేసెను; అవి యీ గ్రంథమందు వ్రాయబడియుండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమి్మ ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను.."12

శోధన అనగా....... TEMPTATION....?

గ్రీకు మూల పదాల లో శోధన లేక శోధనము అనే పదాలకు రెండు అర్ధలు ఉన్నాయి.1 పరిశీలన,పరిశోధన,పరీక్ష, ప్రక్షాళన, శుద్ధిచేయుట ఇది -దేవుని పని  2. కల్...