బైబిల్ ను 1500 సంవత్సరాల వ్యవధిలో, 40 రచయితలు వ్రాశారు. ఇతర మత రచనలకు భిన్నంగా, బైబిల్ వాస్తవిక సమాచార శ్రవంతి వలె నిజమైన సన్నివేశాలు, స్థానములు, ప్రజలు మరియు చర్చ కలిగియుంటుంది. చరిత్రకారులు మరియు పురావస్తుశాస్త్రజ్ఞులు దీని యొక్క నిజాయితీని మరలా మరలా నిర్థారించారు.
రచయితల యొక్క సొంత రచనా శైలిలను మరియు వ్యక్తిత్వాలను ఉపయోగిస్తూ, ఆయన ఎవరో మరియు ఆయనను తెలుసుకొనుట ఎలా ఉంటుందో దేవుడు మనకు చూపుతున్నాడు.
బైబిల్ యొక్క ఈ 40 రచయితలు స్థిరముగా ఒక మూల సందేశమును బయలుపరచారు: మనలను సృష్టించిన దేవుడు మనతో అనుబంధం కలిగియుండాలని ఆశించుచున్నాడు. ఆయనను తెలుసుకొనుటకు మరియు ఆయనను నమ్ముటకు మనలను ఆయన పిలుస్తున్నాడు.
బైబిల్ కేవలం మనలను ప్రోత్సహించుట మాత్రమే కాదుగాని, అది మనకు జీవమును దేవుని వివరిస్తుంది. మన యొద్ద ఉన్న ప్రశ్నలన్నిటికీ అది జవాబు ఇవ్వకపోవచ్చుగాని, కావలసినన్ని జవాబులు ఇస్తుంది. ఉద్దేశము మరియు కరుణతో ఎలా జీవించాలో అది మనకు చూపుతుంది. ఇతరులతో ఎలాంటి అనుబంధం కలిగియుండాలి. శక్తి, దిశ కొరకు దేవునిపై ఆధారపడి మన పట్ల ఆయన ప్రేమను అనుభవించుటకు అది మనలను పురికొల్పుతుంది. నిత్య జీవమును ఎలా కలిగియుండగలమో కూడా బైబిల్ మనకు చెబుతుంది.
పలు విభాగాల రుజువులు బైబిల్ యొక్క చారిత్రక ఖచ్చితత్వమును మరియు దాని దైవిక రచనను సమర్థిస్తాయి. మీరు బైబిల్ ను నమ్ముటకు కొన్ని కారణాలు ఇవి.
బైబిల్ యొక్క చారిత్రక ఖచ్చితత్వమును పురావస్తుశాస్త్రము నిర్థారిస్తుంది.
పురావస్తుశాస్త్రవేత్తలు తరచుగా బైబిల్ లో ప్రస్తావించబడిన ప్రభుత్వ అధికారులు, రాజులు, పట్టణములు, మరియు పర్వముల పేర్లు కనుగొన్నారు—కొన్ని సార్లు చరిత్రకారులు అట్టి ప్రజలు లేక స్థలములు ఉన్నాయని ఆలోచించనప్పుడు కూడా. ఉదాహరణకు, బెతేస్థ అను కోనేరు యొద్ద యేసు ఒక కుంటివాడిని స్వస్థపరచుటను గూర్చి యోహాను సువార్త చెబుతుంది. వాక్యభాగము కోనేరు యొద్దకు వెళ్లుటకు ఉన్న ఐదు ద్వారములను గూర్చి కూడా చెబుతుంది. ముందుగా అట్టి కోనేరు ఉన్నదని పండితులు భావించలేదు, కాని తరువాత భూమిలో 40 అడుగుల లోతున పురావస్తుశస్త్రవేత్తలు ఐదు ద్వారములతో సహా ఆ కోనేరును కనుగొన్నారు.1
బైబిల్ లో చారిత్రక వివరములు విరివిగా ఉన్నాయి కాబట్టి, దానిలో ఉన్న ప్రతి దానిని పురావస్తుశాస్త్రం కనుగొనలేదు. అయితే, ఏ ఒక్క పురావస్తుశాస్త్ర ఆవిష్కరణ కూడా బైబిల్ కథనాలను ఖండించేదిగా లేదు.2
భిన్నంగా, పత్రకారుడైన Lee Strobel Book of Mormon పై ఈ వ్యాఖ్యలు చేశాడు: “అమెరికాలో చాలా కాలం క్రితం జరిగాయని అది చెప్పుచున్న సన్నివేశాలకు పురావస్తుశాస్త్రం నిర్థారించలేకపోయింది. మొర్మన్లు చేసే దావలలో ఏమైనా సత్యముందా అని విచారించమని Smithsonian Institute కు నేను వ్రాసాను, మరియు వారు ఏకగ్రీవంగా చెప్పిన మాట ఏమిటంటే ‘నూతన లోకము యొక్క పురావస్తు శాస్త్రమునకు మరియు ఆ పుస్తకములోని విషయాలకు ఎలాంటి అనుబంధం లేదని’ పురావస్తుశాస్త్రవేత్తలు గమనించారు.” Book of Mormonలో ప్రస్తావించబడిన పట్టణములు, వ్యక్తులు, పేర్లు, లేక ప్రాంతములను పురావస్తుశాస్త్రవేత్తలు ఎన్నడు గుర్తించలేదు.3
క్రొత్త నిబంధనలోని అపొస్తలుల కార్యములలో లూకా ప్రస్తావించిన అనేక పురాతన ప్రాంతములు పురావస్తుశాస్త్రము గుర్తించింది. “మొత్తం, లూకా ముప్పై రెండు దేశములను, యాబై-నాలుగు పట్టణములను మరియు తొమ్మిది ద్వీపములను ఎలాంటి తప్పు లేకుండా ప్రస్తావిస్తున్నాడు.”4
బైబిల్ ను గూర్చి కొన్ని తప్పు-సిద్ధాంతాలను కూడా పురావస్తుశాస్త్రము ఖండించింది. ఉదాహరణకు, కొన్ని కళాశాలలో నేటికి కూడా మోషే ధర్మశాస్త్రమును (బైబిల్ యొక్క మొదటి ఐదు పుస్తకాలు) వ్రాసియుండడు, ఎందుకంటే ఆ కాలంలో వ్రాయుట ఇంకా కనుగొనబడలేదు. పురావస్తుశాస్త్రవేత్తలు బ్లాకు స్టేలే కనుగొన్నారు. “అది మేకు ఆకారంలో పదములు కలిగి దానిపై హమురబి నియమాలు స్పష్టముగా వ్రాయబడియున్నాయి. అది మోషే-తరువాత వ్రాయబడిందా? లేదు! అది మోషే కాలమునకు ముందే వ్రాయబడింది. అంతే కాదు, అది అభ్రాహాము కాలము కంటే ముందు కాలానికి చెందినది (క్రీ.పూ. 2,000). అది మోషే రచనలకు కనీసం మూడు శతాబ్దాల ముందు వ్రాయబడినది."5
పురావస్తు శాస్త్రం తరచుగా బైబిల్ యొక్క చారిత్రక ఖచ్చితత్వమును నిర్థారిస్తుంది.
బైబిల్ వాస్తవికంగా ఎలా వ్రాయబడిందో నేడు కూడా అలానే ఉంది.
బైబిల్ “చాలా సార్లు” అనువదించబడినది కాబట్టి అది అనువాద ప్రక్రియలో మలినమైపోయిందని కొందరి ఆలోచన. అనువాదాలు వేరే అనువాదాల నుండి చేయబడితే ఇది నిజం కావచ్చు. కాని అనువాదాలు ఆదిమ హెబ్రీ, గ్రీకు మరియు అరమాయి భాషల నుండి కొన్ని వేల పురాతన ప్రతుల ఆధారంగా చేయబడినాయి.
1947లో నేటి ఇశ్రాయేలు దేశము యొక్క పశ్చిమ తీరమున పురావస్తుశస్త్రవేత్తలు కనుగొన్న “మృత సముద్ర ప్రతులు” నేటి పాత నిబంధన యొక్క ఖచ్చితత్వమును నిర్థారిస్తాయి. “మృత సముద్ర ప్రతులలో” పాత నిబంధన లేఖనములను గూర్చి మనం కలిగియున్న ఏ వ్రాతప్రతుల కంటే కనీసం 1,000 సంవత్సరములు పురాతనమైన లేఖనములు ఉన్నాయి. నేడు మనం కలిగియున్న ప్రతులను 1000 సంవత్సరాల పురాతన ప్రతులతో పోల్చితే, 99.5% సమ్మతి కలిగినదిగా ఉంటుంది. మిగిలిన .5% తేడా వాక్యము యొక్క అర్థమును మార్చకుండా చిన్న అక్షర దోషములు మరియు వాక్య వల్లికలోని తేడాలతో కూడినది.
క్రొత్త నిబంధన విషయంలో, అది మానవులు అత్యంత ఆధారపడదగిన పురాతన పుస్తకము.
పురాతన ప్రతులు అన్ని పాపిరస్ మీద వ్రాయబడినవి, మరియు దానికి ఎక్కువ మన్నిక లేదు. కాబట్టి ప్రజలు ఆ సందేశమును ఇతరులకు అందించుటకు వాటిని చేతి వ్రాత ద్వారా తిరిగి వ్రాసేవారు.
Few people doubt Plato వ్రాసిన “The Republic”ను ఎవరు సందేహించారు. అది Plato ద్వారా క్రీ.పూ. 380లో వ్రాయబడిన ఉత్తమమైన రచన. మన యొద్ద ఉన్న దాని కాపీ క్రీ.శ. 900కు చెందినది, అనగా అది వ్రాసిన 1,300 సంవత్సరాల తరువాత కాలమునకు చెందినది. కేవలం ఏడు కాపీలు మాత్రమే ఉనికిలో ఉన్నాయి.
Caesar యొక్క “Gallic Wars” షుమారుగా క్రీ.పూ. 100-44లో వ్రాయబడినవి. ఇప్పుడు మన యొద్ద ఉన్న కాపీలు దానికి 1,000 సంవత్సరాల తరువాత వ్రాయబడినవి. మన యొద్ద పది కాపీలు ఉన్నాయి.
క్రొత్త నిబంధన విషయానికొస్తే, అది క్రీ.శ 50-100లో వ్రాయబడింది, మరియు 5,000 కంటే ఎక్కువ కాపీలు ఉన్నాయి. అన్ని కూడా అవి వ్రాయబడిన 50-225 సంవత్సరాల వ్యవధికి చెందినవి. అంతే గాక, లేఖనముల విషయానికి వస్తే, శాస్త్రులు వాస్తవిక ప్రతులను చాలా జాగ్రత్తగా కాపీ చేశారు. పరిపూర్ణత కొరకు వారు ఆ పనిని మరలా మరలా పరీక్షించారు. క్రొత్త నిబంధన రచయితలు వ్రాసినది మరి ఏ పురాతన రచన కంటే భద్రంగా దాయబడినది. Caesar, Plato, Artistotle మరియు Homer యొక్క రచనల కంటే ఎక్కువగా యేసు జీవితము మరియు మాటలను గూర్చి మనం చదువు విషయములపై ఎక్కువ నమ్మకం ఉంచవచ్చు.
యేసు యొక్క సువార్త కథనములను నమ్ముటకు మరి కొన్ని కారణాలు.
యేసు జీవితమును గూర్చి క్రొత్త నిబంధన యొక్క నాలుగు రచయితలు తమ సొంత జీవిత చరిత్రలను వ్రాశాడు. వీటిని నాలుగు సువార్తలని పిలుస్తారు, క్రొత్త నిబంధన యొక్క మొదటి నాలుగు పుస్తకాలు. ఒక జీవిత చరిత్ర నమ్మదగినదో లేదో కనుగొనుటకు చరిత్రకారులు ఈ ప్రశ్న అడుగుతారు, “ఈ వ్యక్తిని గూర్చి ఇవే వివరణలు ఇంకా ఎంత మంది ద్వారా పేర్కొనబడినాయి?”
ఇది ఈ విధంగా పనిచేస్తుంది. మీరు అధ్యక్షుడైన John F. Kennedy యొక్క జీవిత చరిత్రలను సేకరిస్తున్నారని అనుకోండి. ఆయన కుటుంబమును, ఆయన అధ్యక్షతను, చంద్రునిపై మనుష్యుని పంపాలనే ఆయన ధ్యేయం, మరియు క్యూబాలోని మిస్సైల్ సమస్యను ఆయన శాసించిన విధానం గూర్చి వివరించిన అనేక జీవిత చరిత్రలను మీరు కనుగొనవచ్చు. యేసు విషయంలో, ఆయన జీవితమును గూర్చి అవే సత్యములను తెలుపు [పలు జీవిత చరిత్రలు ఉన్నాయా? ఉన్నాయి. యేసును గూర్చి వాస్తవాల యొక్క ఉదాహరణలు, మరియు ప్రతి జీవిత చరిత్రలలో అవి ఎక్కడ చూడవచ్చో ఇక్కడ ఇవ్వబడినాయి.
మత్తయి | మార్కు | లూకా | యోహాను | |
యేసు కన్యగర్భమందు జన్మించాడు | 1:18-25 | - | 1:27, 34 | - |
ఆయన బెత్లేహేములో జన్మించాడు | 2:1 | - | 2:4 | - |
అయన నజరేతులో జీవించాడు | 2:23 | 1:9, 24 | 2:51, 4:16 | 1:45, 46 |
యేసు బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా బాప్తిస్మము పొందాడు | 3:1-15 | 1:4-9 | 3:1-22 | - |
ఆయన స్వస్థత కలిగించు ఆశ్చర్యక్రియలు చేశాడు | 4:24, etc. | 1:34, etc. | 4:40, etc. | 9:7 |
ఆయన నీటి మీద నడచాడు | 14:25 | 6:48 | - | 6:19 |
ఆయన ఐదు రొట్టెలు రెండు చేపలను ఐదు వేల మందికి పంచాడు | 14:7 | 6:38 | 9:13 | 6:9 |
యేసు సామాన్యులకు బోధించాడు | 5:1 | 4:25, 7:28 | 9:11 | 18:20 |
ఆయన సమాజంలో వెలివేయబడిన వారితో సమయం గడిపాడు | 9:10, 21:31 | 2:15, 16 | 5:29, 7:29 | 8:3 |
ఆయన మత గురువులతో వాదించాడు | 15:7 | 7:6 | 12:56 | 8:1-58 |
మత గురువులు ఆయనను చంపాలని ప్రయత్నించారు | 12:14 | 3:6 | 19:47 | 11:45-57 |
వారు యేసును రోమీయులకు అప్పగించారు | 27:1, 2 | 15:1 | 23:1 | 18:28 |
యేసు కొరడాలతో కొట్టబడ్డాడు | 27:26 | 15:15 | - | 19:1 |
ఆయన సిలువవేయబడ్డాడు | 27:26-50 | 15:22-37 | 23:33-46 | 19:16-30 |
ఆయన సమాధిలో పెట్టబడ్డాడు | 27:57-61 | 15:43-47 | 23:50-55 | 19:38-42 |
యేసు మరణం నుండి తిరిగిలేచి తన అనుచరులకు కనిపించాడు | 28:1-20 | 16:1-20 | 24:1-53 | 20:1-31 |
సువార్త జీవిత చరిత్రలలో రెండు అపొస్తలులైన మత్తయి మరియు యోహాను వ్రాశారు, వీరు యేసును వ్యక్తిగతంగా ఎరిగి ఆయనతో మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించిన పురుషులు. మిగిలిన రెండు సువార్తలను అపొస్తలుల యొక్క సన్నిహితులైన మార్కు మరియు లూకా వ్రాశారు. వారు వ్రాయుచున్న సత్యాలతో వారికి దగ్గర అనుబంధం ఉంది. వారు వ్రాయుచున్న సమయంలో, యేసు మాటలు విన్నవారు, ఆయన చేసిన అద్భుతములు చూసిన ప్రజలు బ్రతికే ఉన్నారు.
కాబట్టి ఆదిమ సంఘము నాలుగు సువార్తలను పూర్తిగా అంగీకరించారు, ఎందుకంటే దానిలో ఉన్నవి అప్పటికే యేసు జీవితమును గూర్చి అందరికి తెలిసిన విషయములు.
మత్తయి, మార్కు, లూకా మరియు యోహాను, ప్రతి సువార్త కూడా ఒక సమాచార స్రవంతి వలె, ఆ దిన సన్నివేశాలను వారి వారి దృష్టి కోణాలలో రచయితలు వ్రాసిన విధంగా ఉన్నాయి. వివరణలు ప్రతి రచయితకు విశేషమైనవి, కాని వాస్తవాలు మాత్రం సమ్మతం కలిగియున్నాయి.
సువార్తలు ఇందు నిమిత్తం వ్రాయబడినాయి.
యేసు మరణం మరియు పునరుత్థానం తరువాత ఆరంభ దినాలలో యేసును గూర్చి వ్రాత పూర్వకంగా జీవిత చరిత్రలు వ్రాయబడవలసిన పని లేదు. యెరూషలేము ప్రాంతములో జీవించుచున్నవారు యేసును చూశారు మరియు ఆయన పరిచర్య వారికి బాగుగా తెలుసు.6
అయితే, యేసును గూర్చిన వార్త యెరూషలేము వెలుపల వ్యాపించిన తరువాత, ప్రత్యక్ష సాక్షులు అక్కడ అందుబాటులో లేరు కాబట్టి, యేసు జీవితం మరియు పరిచర్యను గూర్చి ఇతరులకు బోధించుటకు వ్రాతపూర్వక చరిత్ర యొక్క అవసరము వచ్చింది.
యేసును గూర్చి మరి ఎక్కువ తెలుసుకోవాలని ఆశిస్తే, ఆయన జీవితమును గూర్చి ఈ వ్యాసం మంచి సారాంశమును ఇస్తుంది: గ్రుడ్డి నమ్మకమును మించినది.
క్రొత్త నిబంధన పుస్తకాలు ఎలా నిర్థారించబడినవి.
ఆదిమ సంఘము క్రొత్త నిబంధన పుస్తకాలు వ్రాయబడిన వెంటనే వాటిని అంగీకరించింది. ముందుగానే ప్రస్తావించినట్లు, రచయితలు యేసు యొక్క స్నేహితులు లేక తన సన్నిహిత అనుచరులు, మరియు వీరికి యేసు ఆదిమ సంఘము యొక్క నాయకత్వమును ఇచ్చాడు. మార్కు మరియు లూకా అపొస్తలుల యొక్క అనుచరులు, మరియు యేసు జీవితమును గూర్చి అపొస్తలుల యొద్ద ఉన్న సమాచారమును ఆయన పొందారు.
క్రొత్త నిబంధన యొక్క ఇతర రచయితలకు కూడా యేసు అనుచరులే: యాకోబు మరియు యూదా యేసు యొక్క సహోదరులు మరియు ఆరంభములో వారు ఆయనను నమ్మలేదు. పేతురు 12 మంది అపొస్తలులలో ఒకడు. పౌలు ఆరంభములో మత అధికారులలో సభ్యునిగా ఉండి క్రైస్తవ్యమునకు విరోధిగా ఉండి, యేసు మరణము నుండి తిరిగిలేచాడని నమ్మి యేసు యొక్క అనుచరుడైయ్యాడు.
క్రొత్త నిబంధన కథనాలు కొన్ని వేల మంది ప్రత్యక్ష సాక్షుల కథనాలతో నిర్థారించబడింది.
కొన్ని పుస్తకాలు కొన్ని వందల సంవత్సరాల తరువాత వ్రాయబడినప్పటికీ, అవి తప్పిదములని గుర్తించుట కష్టము కాలేదు. ఉదాహరణకు, యూదా సువార్త ఒక జ్ఞాస్తిక్ తెగ ద్వారా యూదా మరణించిన చాలా కాలం తరువాత షుమారుగా క్రీ.శ. 130-170లో వ్రాయబడినది. తోమా సువార్త కూడా క్రీ.శ. 140లో వ్రాయబడి, అపొస్తలుని పేరిట వ్రాయబడిన నకిలీ రచనకు మరొక ఉదాహరణగా ఉంది. ఇవి మరియు ఇతర జ్ఞాస్తిక్ సువార్తలు యేసు మరియు పాత నిబంధన యొక్క తెలిసిన బోధలకు వ్యతిరేకంగా ఉండి, చాలా సార్లు గొప్ప చారిత్రక మరియు భౌగోళిక తప్పిదములు కలిగినవిగా ఉన్నాయి. 7
క్రీ.శ. 367లో, Athanasius అధికారికంగా 27 క్రొత్త నిబంధన పుస్తకాలను నిర్థారించాడు (మనం నేడు కలిగియున్న పుస్తకాలే). వెంటనే తరువాత, Jerome మరియు Augustine అదే జాబితాను ప్రతిపాదించారు. అయితే ఎక్కువ మంది క్రైస్తవులు ఈ జాబితను అనుసరిస్తారని కాదు. క్రీస్తు తరువాత మొదటి శతాబ్దం నుండి ఈ పుస్తకాల జాబితాను చాలా వరకు సంఘమంతా గుర్తించింది.
సంఘము గ్రీకు మాట్లాడు ప్రాంతములను దాటి బయటకు వెళ్లినప్పుడు లేఖనములు అనువదించవలసిన అవసరత వచ్చినది, మరియు కొన్ని తెగలు తమ సొంత పవిత్ర పుస్తకాలను పుట్టించుచుండెను కాబట్టి, ఒక నిర్థారిత జాబితా చాలా అవసరమైనది.
యేసును గూర్చి బైబిల్ చెబుతున్న వాటిని చరిత్రకారులు నిర్థారిస్తారు.
భద్రపరచిన వాస్తవిక ప్రతుల యొక్క కాపీలు మాత్రమే కాదు, మన యొద్ద యూదా మరియు రోమా చరిత్రకారుల యొక్క సాక్ష్యములు కూడా ఉన్నాయి.
నజరేయుడైన యేసు అనేక ఆశ్చర్య క్రియలు చేశాడని, రోమీయుల ద్వారా హతమార్చబడ్డాడని, మరణము నుండి తిరిగిలేచాడని సువార్త కథనములు తెలియజేస్తున్నాయి. యేసు మరియు ఆయన అనుచరుల యొక్క జీవితమును గూర్చి అనేక పురాతన చరిత్రకారులు బైబిల్ కథనములను సమర్థిస్తున్నారు:
Cornelius Tacitus (క్రీ.శ. 55-120), మొదటి శతాబ్దం రోమా యొక్క చరిత్రకారుడు, పురాతన ప్రపంచం యొక్క అత్యంత ఖచ్చితమైన చరిత్రకారులలో ఒకనిగా గుర్తించబడినాడు.8 రోమా చక్రవర్తియైన నీరో “క్రైస్తవులు అని పిలువబడు తెగపై అత్యంత ఘోరమైన అరాచకాలు చేశాడు... వీరి పేరు క్రిష్టస్ [క్రీస్తు] నుండి వచ్చినది, ఆయన పొంతు పిలాతు చేతులలో తిబెరు చక్రవర్తి కాలంలో ఘోరమైన శిక్షను అనుభవించాడు....”9 అని Tacitus వ్రాశాడు.
యూదా చరిత్రకారుడైన Flavius Josephus (క్రీ.శ. 38-100) తన Jewish Antiquitiesలో యేసును గూర్చి వ్రాశాడు. “యేసు జ్ఞానవంతుడు, ఆశ్చర్యక్రియలు చేశాడు, అనేకులకు బోధించాడు, యూదులు మరియు గ్రీకుల నుండి అనుచరులను గెలచుకున్నాడు, మెస్సీయగా గుర్తించబడ్డాడు, యూదా నాయకుల నిందను పొందాడు, పిలాతుచే శిక్షను పొందాడు, పునరుత్థానుడని ఎంచబడ్డాడు”10 అని Josephus ద్వారా మనం నేర్చుకొనవచ్చు.
Suetonius, Pliny the Younger, మరియు Thallus కూడా క్రొత్త నిబంధన కథనాలకు అనుగుణంగా క్రైస్తవ ఆరాధన మరియు హింసను గూర్చి వ్రాశారు.
యూదుల Talmud కూడా యేసు జీవితములోని ముఖ్యమైన అంశములను సమర్థిస్తుంది. Talmud నుండి ఈ మాటలు, "యేసు వివాహమునకు వెలుపల జన్మించాడని, శిష్యులను సమకూర్చాడని, తన గూర్చి దైవదూషణ దావాలు చేశాడని, మరియు ఆశ్చర్య క్రియలు చేశాడని నేర్చుకొనుచున్నాము, కాని ఈ అద్భుతాలు దేవుని వలన గాక గారడీ వలన కలిగినవి.”11
ఎక్కువ మంది పురాతన చరిత్రకారులు రాజకీయ లేక సైన్య నాయకులపై దృష్టి ఉంచారని, రోమా సామ్రాజ్యంలో ఒక మూలన ఉన్న మత బోధకులను అంతగా పట్టించుకోలేదని గుర్తిస్తే ఇది ప్రాముఖ్యమైన సమాచారం. అయినను పురాతన చరిత్రకారులు (యూదులు, గ్రీకులు, మరియు రోమీయులు), వారు విశ్వాసులు కానప్పటికీ, క్రొత్త నిబంధనలో ఇవ్వబడిన ముఖ్యమైన సన్నివేశాలను చూపిస్తారు.
సువార్తలలో ఉన్నది నిజముగా యేసు చెప్పాడు మరియు చేశాడు అనునది ముఖ్యమైన విషయమా?
అవును. విశ్వాసమునకు విలువ ఉండుటకు, అది సత్యములపై ఆధారపడియుండాలి. అందుకు కారణం ఇది. మీరు లండన్ వెళ్లుటకు ఒక విమానం ఎక్కిన యెడల, ఆ విమానంలో ఇంధనం ఉందని, పైలోట్ తర్ఫీదు పొందినవాడని, మరియు ఆ విమానంలో తీవ్రవాదులు ఎవరు లేరని మీరు నమ్ముతారు. మీ విశ్వాసం మిమ్మును లండన్ కు తీసుకొనివెళ్లదు. మీ విశ్వాసం మిమ్మును విమానం ఎక్కించుటలో సహాయపడుతుంది. కాని మిమ్మును ఆ విమానం మరియు పైలట్ లండన్ కు తీసుకొని వెళ్తారు. మీరు గతంలో చేసిన విమాన ప్రయాణాలలోని మంచి అనుభూతులను నమ్మవచ్చు. కాని మీ మంచి అనుభూతులు మిమ్మును లండన్ తీసుకొని వెళ్లుటకు సరిపోవు. మీ విశ్వాసం యొక్క మూలం ప్రాముఖ్యమైనది—అది నమ్మశక్యమైనదేనా?
క్రొత్త నిబంధన యేసును గూర్చిన ఖచ్చితమైన, నమ్మదగిన కథనమేనా? అవును. క్రొత్త నిబంధనకు గొప్ప వాస్తవాల బలం ఉంది కాబట్టి మనం దానిని నమ్మవచ్చు. ఈ వ్యాసం క్రింది విషయాలను చూసింది: చరిత్రకారులు సమ్మతిస్తారు, పురావస్తుశాస్త్రం సమ్మతిస్తుంది, నాలుగు సువార్తలు అంగీకారంలో ఉన్నాయి, ప్రతుల యొక్క కాపీలు భద్రపరచుట గొప్ప విషయం, అనువాదాలలో ఉన్నత స్పష్టత ఉన్నది. మనం నేడు చదివేది నిజమైన రచయితలు వ్రాసిన నిజ జీవితాలలో నిజ స్థలములలో అనుభవించినది అని నమ్ముటకు ఇది మనకు బలమైన పునాదిని ఇస్తుంది.
రచయితలలో ఒకరైన యోహాను దీనిని ఈ విధంగా సారంశ రూపంలో చెబుతున్నాడు, "మరియు అనేకమైన యితర సూచకక్రియలను యేసు తన శిష్యులయెదుట చేసెను; అవి యీ గ్రంథమందు వ్రాయబడియుండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమి్మ ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను.."12
No comments:
Post a Comment