Wednesday, 14 March 2018

ఇంటర్ తర్వాత కేంద్రీయ విశ్వవిద్యాలయం లోచదువు కోవచ్చు......In Central university


కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో కోరుకున్న కోర్సు
ఇంటర్‌ తర్వాత మనకు ఇష్టమైన కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కోరుకున్న కోర్సు చదువుకునే అవకాశం ఉంది. ఒకే పరీక్షతో పదకొండు కేంద్ర సంస్థల్లోకి ప్రవేశించవచ్చు. బీఎస్సీ, బీటెక్‌, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌, బీఏ, ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ, బీఎడ్‌, ఇంటిగ్రేటెడ్‌ బీఎడ్‌, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, లా, ఆర్ట్స్‌, సైన్స్‌, హ్యుమానిటీస్‌ ఇలా వందకు పైగా కోర్సుల్లో అడ్మిషన్‌కు వీలు కల్పిస్తోంది. సెంట్రల్‌ యూనివర్సిటీస్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (సీయూ సెట్‌).
సాధారణంగా నచ్చిన కోర్సులో చేరడానికి పలు సంస్థలకు దరఖాస్తు చేసుకోవాలి. చాలా పరీక్షలూ రాయాలి. దీనికి ఎక్కువ సమయంతోపాటు డబ్బు కూడా వెచ్చించాలి. కానీ ఇటీవలి కాలంలో ఏర్పడిన కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఒకే పరీక్షతో అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయి. అదే సీయూ సెట్‌. దీని ద్వారా 11 సంస్థల్లో నచ్చిన కోర్సులో చేరిపోవచ్చు. ఆర్ట్స్‌, సైన్స్‌, కామర్స్‌, మేనేజ్‌మెంట్‌, టీచింగ్‌, ఇంజినీరింగ్‌, లా, డిజైన్‌, ఎంఫిల్‌, పీహెచ్‌డీ...ఇలా ప్రతి విభాగంలోనూ ఈ విశ్వవిద్యాలయాలు కోర్సులు అందిస్తున్నాయి. ఇంటర్‌, డిగ్రీ, పీజీ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఈ పరీక్ష గొప్ప అవకాశం. సెంట్రల్‌ యూనివర్సిటీల్లో బోధన, ల్యాబ్‌, లైబ్రరీలు, వసతులు మెరుగ్గా ఉంటాయి. ఫీజు కూడా భరించగలిగే స్థాయిలోనే ఉంటుంది. కాబట్టి డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరాలనుకున్నవాళ్లు సీయూ సెట్‌ ప్రయత్నించవచ్చు. ఈ ఏడాది పరీక్షలకు రాజస్థాన్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ సమన్వయకర్తగా వ్యవహరిస్తోంది.
ప్రవేశం కల్పించే కేంద్రీయ విశ్వవిద్యాలయాలు: హరియాణ, జమ్మూ, జార్ఖండ్‌, కర్ణాటక, కశ్మీర్‌, కేరళ, పంజాబ్‌, రాజస్థాన్‌, సౌత్‌ బిహార్‌, తమిళనాడులతో పాటు డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌- బెంగళూరు.
ప్రశ్నపత్రం ఇలా... 
అభ్యర్థి ఏ కోర్సుకి, ఏ విభాగానికి దరఖాస్తు చేసుకున్నప్పటికీ ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్‌ తరహాలోనే ఉంటుంది. పార్ట్‌-ఎలో లాంగ్వేజ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, మ్యాథమేటికల్‌ ఆప్టిట్యూడ్‌, అనలిటికల్‌ స్కిల్స్‌ విభాగాల నుంచి 25 ప్రశ్నలు వస్తాయి. పార్ట్‌-బిలో సంబంధిత అంశం (సబ్జెక్టు) నుంచి 75 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో మూడు నుంచి అయిదు వరకు సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్‌ నుంచీ 25 ప్రశ్నల చొప్పున వస్తాయి. అభ్యర్థులు తమకు నచ్చిన 3 సెక్షన్లు ఎంచుకుని 75 ప్రశ్నలకు సమాధానాలు గుర్తిస్తే సరిపోతుంది. కొన్ని ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు/ ఎంబీఏ/ ఎల్‌ఎల్‌బీ లేదా మరేదైనా ఇతర కోర్సుల్లో ప్రవేశానికి వంద మార్కులకు ఒకే పేపర్‌ ఉండవచ్చు. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, రీజనింగ్‌, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌/ న్యూమరికల్‌ ఎబిలిటీ, జనరల్‌ అవేర్‌నెస్‌, అనలిటికల్‌ స్కిల్స్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. తప్పుగా గుర్తించిన ప్రతి జవాబుకు పావు మార్కు చొప్పున తగ్గిస్తారు.
డిగ్రీ విద్యార్థులకు... 
డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఈ కింది కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
ఎమ్మెస్సీ: మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్‌, జాగ్రఫీ, జియో ఇన్‌ఫర్మేటిక్స్‌, జియాలజీ, అప్లైడ్‌ జియాలజీ, జీనోమిక్‌ సైన్స్‌, యానిమల్‌ సైన్స్‌, బయో కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ, మైక్రో బయాలజీ, ప్లాంట్‌ సైన్స్‌, న్యూట్రిషన్‌ బయాలజీ, బయో ఇన్‌ఫర్మేటిక్స్‌, కెమికల్‌ సైన్సెస్‌ (మెడిసినల్‌ కెమిస్ట్రీ), అప్లైడ్‌ కెమిస్ట్రీ, కంప్యుటేషనల్‌ కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్‌, మెటీరియల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, అట్మాస్ఫిరిక్‌ సైన్స్‌, ఎపిడమాలజీ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌, యోగా థెరపీ, డిజిటల్‌ సొసైటీ, సైకాలజీ, అప్లైడ్‌ సైకాలజీ మొదలైనవి.
ఎంఏ: ఎడ్యుకేషన్‌, ఇంగ్లిష్‌, లింగ్విస్టిక్స్‌, హిందీ, హిస్టరీ, పెర్ఫామింగ్‌ ఆర్ట్స్‌, జాగ్రఫీ, సోషియాలజీ, సోషల్‌ వర్క్‌, మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, హ్యూమన్‌ రైట్స్‌ అండ్‌ కాన్‌ఫ్లిక్ట్స్‌ మేనేజ్‌మెంట్‌, డెవలప్‌మెంట్‌ స్టడీస్‌, కంపారిటివ్‌ రెలిజియన్‌, నేషనల్‌ సెక్యూరిటీ స్టడీస్‌, డిజిటల్‌ సొసైటీ, కస్టమరీ లా అండ్‌ ట్రైబల్‌ గవర్నెన్స్‌, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఎకనామిక్స్‌, సైకాలజీ తదితరాలు.
ఎంఫార్మ్‌: ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌
ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ బీఎడ్‌: కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్‌, ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌. 
ఇంకా ఎంబీఏ, ఎంసీఏ, ఎంకాం, మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ (ఎంపీహెచ్‌), ఎంఎల్‌ఐఎస్సీ, ఎంటెక్‌, ఎంపీఈడీ, బీఎడ్‌, ఎంఎడ్‌, ఎల్‌ఎల్‌ఎం, ఎంటీటీఎం, ఎంహెచ్‌ఎంసీటీ తదితర కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది.
పీజీ డిప్లొమా: కెమికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌, సైబర్‌ సెక్యూరిటీ, గైడెన్స్‌ అండ్‌ కౌన్సెలింగ్‌ 
వీటితోపాటు ప్రతి సబ్జెక్టులోనూ ఎంఫిల్‌, పీహెచ్‌డీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 
యూనివర్సిటీ, కోర్సులవారీ సీట్లు, సిలబస్‌ వివరాలు, మాదిరి ప్రశ్నపత్రాలు సీయూ సెట్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 26 
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం.
పరీక్ష ఫీజు: జనరల్‌, ఓబీసీలకు రూ.800, ఎస్సీ, ఎస్టీలకు రూ.350. దివ్యాంగులు ఫీజు చెల్లించనవసరం లేదు. 
పరీక్ష తేదీలు: ఏప్రిల్‌ 28, 29 
ఫలితాలు: మే 25న ప్రకటిస్తారు. 
వెబ్‌సైట్‌: https://cucetexam.in
ఇంటర్‌ విద్యార్థులకు అందుబాటులో ఉన్న కోర్సులు
ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ (కర్ణాటక సెంట్రల్‌ యూనివర్సిటీ), బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రికల్‌, సివిల్‌, ప్రింటింగ్‌ అండ్‌ ప్యాకేజింగ్‌ టెక్నాలజీ) హరియాణ సెంట్రల్‌ యూనివర్సిటీ అందిస్తోంది. ఇంటిగ్రేటెడ్‌ బీఎస్సీ బీఎడ్‌ కోర్సును తమిళనాడు సెంట్రల్‌ యూనివర్సిటీ, ఇంటిగ్రేటెడ్‌ బీఎస్సీ బీఎడ్‌, ఇంటిగ్రేటెడ్‌ బీఏ బీఎడ్‌ కోర్సులను సౌత్‌ బిహార్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ అందిస్తున్నాయి.
ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, జువాలజీ, లైఫ్‌ సైన్సెస్‌, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బోటనీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, సైకాలజీ, జాగ్రఫీ, జియాలజీ, ఎకనామిక్స్‌
ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ: ఇంగ్లిష్‌, ఎకనామిక్స్‌, ఇంటిగ్రేటెడ్‌ బీఏ ఎల్‌ఎల్‌బీ బీఎస్సీ:టెక్‌స్టె్టౖల్స్‌, బీఏ: ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌.
బ్యాచిలర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ స్టడీస్‌: బయోమెడికల్‌ సైన్సెస్‌, ఇండస్ట్రియల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, రిటైల్‌ అండ్‌ లాజిస్టిక్‌ మేనేజ్‌మెంట్‌, టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌.
Posted on 22-02-2018

No comments:

Post a Comment

శోధన అనగా....... TEMPTATION....?

గ్రీకు మూల పదాల లో శోధన లేక శోధనము అనే పదాలకు రెండు అర్ధలు ఉన్నాయి.1 పరిశీలన,పరిశోధన,పరీక్ష, ప్రక్షాళన, శుద్ధిచేయుట ఇది -దేవుని పని  2. కల్...