కొత్తగా పెళ్ళైన ఒక అబ్బాయికి ఒక డౌటు వచ్చింది. తన భార్యకు చెవులు సరిగ్గ వినపడవేమో అని. అది ఎలా తెలుసుకోవాలి. నేరుగా అడిగితే కొత్తపెళ్ళాం కదా
బాధపడుతుందేమో అనుకున్నాడు. ఎలాగైనా తెలుసుకోవాలని ఫ్యామిలీ డాక్టరు దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెప్పాడు. డాక్టరు దానికి నవ్వి ఇలా అన్నాడు.
" ఇదేం పెద్ద విషయం సార్......మీ భార్యను కొంత దూరం నుండి ఏదైనా
అడగండి. జవాబు రాకుంటే...ఇంకాస్త దగ్గరికెళ్ళి అడగండి. అప్పటికీ
జవాబు రాకుంటే మరికాస్త దగ్గరికెళ్ళి అడగండి. అప్పుడు కూడా
ప్రయోజనం లేదనుకుంటే తీసుకుని రండి ట్రీట్మెంటు ఇస్తాను "
అరే ఇదేదో బాగా పనికొచ్చే ఆలోచన అనుకుని ఉత్సాహంగా ఇంటికి వెళ్ళాడు.
ఇంటికి వస్తూ తన భార్య వంట ఇంట్లో ఉండటాన్ని గమనించాడు.గేటు దగ్గరనుండి
భార్యను ఇలా అడిగాడు.
" ప్రియా! ఈ రోజు వంట ఏం చేస్తున్నావు? "
అటువైపునుండి జవాబు రాలే్దు. హా్ల్లోకి వచ్చి మళ్ళీ అలానే అడిగాడు.
జవాబు రాలేదు. పక్కరూంలోకి వెళ్ళి మరీ అడిగాడు జవాబు రాలేదు.
ఇలా లాభం లేదనుకుని వంటగదిలోకి వెళ్ళి తన భార్య చెవిదగ్గర
బిగ్గరగా " ఈ రోజు వంట ఏంటని ? " అరిచాడు.
ఆ అరుపుకు బెదిరిపోయిన భార్య ఇలా అంది.
" మీకేమైనా పిచ్చిగాని పట్టిందా???? గేటు దగ్గరినుండి ఇదే అడిగారు.
అప్పుడే చెప్పాను సాంబారు, బంగాళా దుంప వేపుడు అని.
మళ్ళీ హాలులోకి వచ్చి అడిగారు. మళ్ళీ ఇదే చెప్పాను. పక్క గదిలోకి
వెళ్ళి అడిగినా విసుక్కోకుండా జవాబు చెప్పాను. మీకు చెవుడా!"
ఇప్పుడు అర్థం అయిందా చెవుడు ఎవరికో! ఇలాగే కొంతమంది తమలో
ఎన్ని లోపాలున్నాయో తెలుసుకోరు. ఇతరులలో లోపాలను వెతుకుతారు.
మనలోని లోపాలను తెలుసుకుని సరిదిద్దు కోవాలే తప్ప ఇతరులలోని
లోపాలపై సమీక్ష చేయడం తప్పు.......నచ్చితే లైక్ చేయండి.....
బాగా నచ్చితే షేర్ చేయండి........విజయ.కె..........విజయపథం.
ఇతనికి చెవుడు అయితే డాక్టరు చెప్పింది ఎలా విన్నాడు అని మీకు డౌటు
వచ్చింది కదా! ఫ్యామిలీ డాక్టరుకు ఇతనికి చెవి పాక్షికంగా వినపడదని
తెలుసు.అత్యంత దగ్గరగా ఉండి మాట్లాడితేనే వినిపిస్తుందనీ తెలుసు.తన లోపాన్ని అతను తెలుసుకునేలా డాక్టరు ఇలా చెప్పారు
కాబట్టె అతనికి అతి సమీపంనుండి చెప్పాడు.
ఇది జస్ట్ ఇతరులలోని లోపాలను వెతికే ముందు మనలోని లోపాలను
సరిదిద్ధుకోవడం మంచిది అని చెప్పడానికే సుమా!

No comments:
Post a Comment